వైయస్ జగన్‌పై సిపిఎం సాఫ్ట్: టిడిపి నేత ఎర్రబెల్లి ఫైర్

Errabelli Dayakar Rao
హైదరాబాద్: వైయస్ జగన్ నాయకత్వంలోని వైయస్ జగన్ పట్ల సిపిఎం మెతక వైఖరిపై, తమ పార్టీపై సిపిఎం చేస్తున్న విమర్శలపై తెలుగుదేశం పార్టీ నాయకుడు ఎర్రబెల్లి దయాకర్ రావు మండిపడ్డారు. విద్యుచ్ఛక్తి సమస్యపై నిర్వహించిన ధర్నా కార్యక్రమంలో ఆయన వైయస్సార్ కాంగ్రెసు పార్టీపై విరుచుకుపడ్డారు. దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డిపై కూడా ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు.

రాష్ట్ర భ్రష్టు పట్టడానికి వైయస్ రాజశేఖర రెడ్డి కారణమని ఆయన దుమ్మెత్తిపోశారు. ముదిగొండ కాల్పుల ఘటనకు కూడా వైయస్ రాజశేఖర రెడ్డి కారణమని ఆయన ఆరోపించారు. ఈ విషయంపై సిపిఎం ఎందుకు మాట్లాడడం లేదని ఆయన ప్రశ్నించారు. హైదరాబాద్ బషీర్‌బాగ్ ఘటనపై సిపిఎం పదే పదే మాట్లాడడం సరి కాదని ఆయన అన్నారు. తెలుగుదేశం పార్టీని సిపిఎం పదే పదే విమర్శించడం మంచిది కాదని ఆయన సిపిఎంకు హితవు చెప్పారు.

సిపిఎం తన తీరు మార్చుకోవాలని ఆయన సూచించారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ విద్యుత్తు రంగాన్ని భ్రష్టు పట్టిందని ఆయన అన్నారు. అటువంటి పార్టీ విద్యుత్తు సమస్యపై బంద్‌కు పిలుపు ఇచ్చిందని, ఆ బంద్‌ను ప్రజలు తిప్పికొట్టాలని ఆయన అన్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ తలపెట్టిన బంద్‌కు సహకరించకూడదని ఆయన సూచించారు.

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి ప్రభుత్వ హయాంలో విద్యుత్ సమస్యపై ఆందోళనకు దిగినవారిపై పోలీసులు కాల్పులు జరపడంతో ముగ్గురు మరణించారు. వారి మృతిని గుర్తు చేసుకుంటూ సిపిఎం అమరవీరుల సంస్మరణ దినంగా ర్యాలీ నిర్వహించింది. వైయస్ రాజశేఖర రెడ్డితో కలిసి అప్పట్లో వామపక్షాలు చంద్రబాబు ప్రభుత్వంపై ఆందోళనకు దిగాయి. ప్రస్తుతం సిపిఐ తెలుగుదేశం పార్టీకి దగ్గరవుతుండగా, సిపిఎం వైయస్సార్ కాంగ్రెసు పట్ల మెతక వైఖరి అవలంబిస్తోంది. దీంతోనే ఎర్రబెల్లి దయాకర్ రావు సిపిఎంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+