రిటైర్డ్ సిఐ వీరంగం:ప్రియురాలిచే ప్రియుడి పాప కిడ్నాప్

కాల్పుల శబ్ధం విన్న గ్రామస్తులు వెంటనే అక్కడకు చేరుకొని విశ్వనాథాన్ని పట్టుకొని పోలీసులకు అప్పగించారు. అతనికి మతిస్థిమితం లేనందువల్లే ఈ ఘటనకు పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు. అసలు విశ్వనాథం డబుల్ బారెల్ గన్‌కు లైసెన్స్ ఉందా లేదా అనే కోణంలో విచారణ జరుపుతున్నారు.
తల్లి మృతి చెందడంతో పెద్ద కర్మ నిర్వహించేందుకు విశ్వనాథం బాపట్ల వచ్చాడని, తన వద్ద ఉన్న గన్‌తో ఇసుక లోడ్‌తో వెళ్తున్న లారీపై కాల్పులు జరిపాడని, ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదని, తాము అతన్ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నామని పోలీసులు చెప్పారు.
కరీంనగర్ జిల్లా వావిలాలపల్లిలో ఓ బాలిక అపహరణకు గురైంది. శ్రీనివాస్, భాగ్యలక్ష్మి దంపతుల కూతురు 7 నెలల చిన్నారిని రాత్రి సమయంలో దుండగులు ఎత్తుకెళ్లినట్లు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. శనివారం రాత్రి తన భర్త సినిమాకు వెళ్లారని, ఇంట్లో తలుపులు గడియ వేయక పోవడంతో గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి పాపను ఎత్తుకు పోయారని తల్లి తెలిపింది.
కాగా ఈ కిడ్నాప్ కథ అదివారం మధ్యాహ్నం సుఖాంతమైంది. తండ్రి ప్రియురాలే ఈ పాపను ఎత్తుకు పోయినట్లుగా పోలీసులు గుర్తించారు. నిందితురాలిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.












Click it and Unblock the Notifications