సిబిఐ విచారణకు నవీన్ పట్టు: ఎస్పీ వర్సెస్ ఏఎస్పీ

గంజాయి రాకెట్ ఆధారాలను బయటకు తీసినందుకే తనపై హత్యాయత్నం జరిగిందన్నారు. ఎస్పీపై తాను చేసిన ఆరోపణలను ఉన్నతాధికారులు క్రమశిక్షణ రాహిత్యంగా చూస్తున్నారే తప్ప కోట్లాది రూపాయల గంజాయి రాకెట్, ఇతర అక్రమాలను ఎందుకు సీరియస్‌గా తీసుకోవట్లేదో తనకు అర్థం కావట్లేదన్నారు. ఈ వ్యవహారంపై సిబిఐ లేదా ఏదైనా కేంద్ర సంస్థతో దర్యాప్తు చేయించాలని విజ్ఞప్తి చేశారు. తనకు న్యాయం జరగకపోతే అన్ని ఆధారాలతో హైకోర్టును ఆశ్రయిస్తానని నవీన్ స్పష్టం చేశారు. ఐపిఎస్ అధికారినైన తనకే న్యాయం జరగనప్పుడు డ్రైవర్, గన్‌మెన్ ఎలా బయటకు వచ్చి జరిగిన విషయాలు చెబుతారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. త్రివిక్రంపై తన వద్ద ఆధారాలు ఉన్నాయన్నారు.
జరిగిన సంఘటనలపై డ్రైవర్ ఏడుకొండలు, గన్‌మెన్ శ్రీనివాస్, గోవింద్ కూడా విలేకరులతో మాట్లాడారు. పెద్దల తగాదాలో తమను బలిపశువుల్ని చేయొద్దని వేడుకున్నారు. మరోవైపు పోలీసుశాఖలో క్రమశిక్షణ తప్పితే ఎటువంటి వారినైనా ఉపేక్షించేది లేదని హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. తూర్పుగోదావరి జిల్లా మలికిపురం మండలం దిండిలో ఆమె విలేకరులతో మాట్లాడారు. జిల్లాలో ఎస్పీ-ఏఎస్పీల మధ్య వివాదంపై డిఐజి నివేదిక అందగానే చర్యలు తీసుకుంటామన్నారు.
తూర్పుగోదావరి జిల్లాతో తనకు మూడేళ్ల అనుబంధం ఉందని, ఇన్‌చార్జి మంత్రిగా రెండోసారి నియామకం జరిగిన తర్వాత జిల్లాకు వస్తే పుట్టింటికి వచ్చినంత అనుభూతి పొందానన్నారు. జిల్లాలో 15 పోలీస్ స్టేషన్‌లకు భవనాలు మంజూరు చేశామన్నారు. ఐదు పూర్తికాగా 5 నిర్మాణ దశలో ఉన్నాయని, మరో ఐదింటికి టెండర్లు పిలుస్తున్నట్టు తెలిపారు. జిల్లాలో పోలీసు శిక్షణ కేంద్రం ఏర్పాటు చేయనున్నామన్నారు. దివంగత వైయస్‌కు ఈ జిల్లా అంటే అభిమానమని, 2014లోనూ కాంగ్రెసును భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు.












Click it and Unblock the Notifications