వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రామోజీ రావు కుమారుడు సుమన్ అకాల మృతి

By Pratap
|
Google Oneindia TeluguNews

Suman
హైదరాబాద్: ఈనాడు దినపత్రిక అధిపతి రామోజీరావు రెండో కుమారుడు సిహెచ్ సుమన్ గురువారం అర్థరాత్రి దాటిన తర్వాత మరణించారు. ఆయన వయ్ససు 45 ఏళ్లు. రచయతగా, దర్శకుడిగా, నటుడిగా ఆయన బుల్లితెర ప్రేక్షకులకు సుపరిచితుడు. నాలుగైదేళ్లుగా ఆయన అస్వస్థతతో బాధపడుతున్నారు. కొద్దికాలంగా ఆయన హైదరాబాదులోని యశోదా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన 1966 డిసెంబర్ 23వ తేదీన జన్మించారు. ఆయన ఉషోదయా ఎంటర్‌ప్రైజెస్ మేనేజింగ్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు.

ఆయనకు ఒక కూతురు, ఒక కుమారుడు ఉన్నారు. భార్య విజయేశ్వరి రామోజీ గ్రూపు సంస్థల్లో భాగమైన డాల్ఫిన్ హోటల్స్‌కు మేనేజింగ్ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. సుమన్ అంత్యక్రియలు ఫల్మ్ సిటీలో జరుగుతాయి. ఆయన హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చదువుకున్నారు. నిజాం కళాశాలలో బిఎ చేశారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో బిసిజె చేశారు. మాస్టర్స్ చేసేందుకు అమెరికా వెళ్లారు. ఈనాడు దినపత్రికలో ఆయన ఇంటర్న్‌షిప్ చేశారు.

ఈనాడు దినపత్రిక సెంట్రల్ డెస్క్‌లో పనిచేసిన సుమన్ సంపాదకీయ పేజీకి వ్యాసాలు కూడా రాశారు. సుమన్ మేనేజింగ్ డైరెక్టర్‌గా 1995 ఆగస్టు 27వ తేదీన ఈటీవీ ప్రారంభమైంది. అంతరంగాలు, లేడీ డిటెక్టివ్, స్నేహ, ఎండమావులు, కళంకిత వంటి ధారావాహికలకు ఆయన కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, సమకూర్చారు. కేవలం టీవీ చానెల్ నిర్వహణకే పరిమితం కాకుండా సృజనాత్మక విభాగాల్లోనూ పని చేశారు.

ఉషా పరిణయం చిత్రంలో సుమన్ నటించారు. దానికి ఆయనే దర్శకత్వం వహించారు. భాగవత గాథ ఆధారంగా నిర్మించిన చిత్రం అది. ఇందులో ఆయన శ్రీకృష్ణుడిగా నటించారు. ఆ తర్వాత పూర్తిస్ఝాయి వినోదాత్మక చిత్రం నాన్ స్టాప్ నిర్మించారు. ఇది ఆయన దర్శకత్వంలోనే వచ్చింది. ఇందులో ఆయన కథానాయకుడిగా నటించారు. ఆధ్యాత్మిక భావనలు మెండుగా ఉన్న సుమన్ శ్రీహరి స్వరాలు పేరుతో భక్తి గీతాల ఆల్బమ్ రూపొందించారు. తాను రాసిన గీతాలకు ఆయనే బాణీలు కట్టుకున్నారు. సుమన్ మృతికి పలువురు ప్రముఖులు సంతాపం ప్రకటించారు.

English summary
Eenadu group chairman Ramoji Rao's son Suman takes his last breath. Suman is the managing director of ETV. He made several serials for ETV.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X