బీహార్‌లో పడవ మునక: పలువురి మృతి, గాలింపు

పడవ మునగగానే ఆరేడు మంది ప్రయాణీకులు ఈదుకుంటూ బయటకు సురక్షితంగా వచ్చారు. మరికొందరిని స్థానికులు రక్షించారు. విషయం తెలుసుకున్న అధికారులు వెంటనే అక్కడకు చేరుకొని గాలింపు చర్యలు చేపట్టారు. ఇప్పటి వరకు ఆరు మృతదేహాలను వెలికి తీశారు. మరో ఇరవై మంది వరకు నీటిలోనే ఉన్నట్లు అనుమానిస్తున్నారు.
స్థానికులు వెంటనే అప్రమత్తమై పలువురిని రక్షించారని, ఇప్పటి వరకు పలు మృతదేహాలు బయటకు తీశామని, ఈ సంఖ్య పెరిగే అవకాశముందని భోజ్‌పుర్ పోలీసు సూపరింటెండెంట్ ఎస్ఆర్ నాయక్ చెప్పారు. ఆరు మృతదేహాలన్ని తీశామని, గాలింపు చర్యలు చేపడుతున్నామని జిల్లా అడ్మినిస్ట్రేషన్ అధికారి చెప్పారు.
పక్కనే ఉన్న అర్వాల్ జిల్లాలోని ఓ విలేజ్ ఫేయిర్‌కు వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మృతి చెందిన ఆరుగురిలో ఇద్దరు పిల్లలు, ఇద్దరు మహిళలు ఉన్నారు.












Click it and Unblock the Notifications