వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఓయు ఉద్రిక్తం: రాళ్ల వర్షం, విద్యార్థికి రబ్బర్ బుల్లెట్?

By Srinivas
|
Google Oneindia TeluguNews

Osmania University
హైదరాబాద్: నెక్లస్ రోడ్డులోని తెలంగాణ కవాతు వేదిక వద్దకు బైక్ ర్యాలీతో బయలుదేరిన ఉస్మానియా విశ్వవిద్యాలయ విద్యార్థులను పోలీసులు ఎన్‌సిసి గేటు వద్ద అడ్డుకోవడం ఉద్రిక్తతకు దారి తీసింది. విద్యార్థులు పోలీసులు వేసిన బారీకేడ్లను, ముళ్లకంచెను తొలగించి బయటకు వచ్చేందుకు ప్రయత్నాలు చేశారు. పోలీసులు, విద్యార్థులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఓ సమయంలో విద్యార్థులు పోలీసుల పైకి రాళ్లు రువ్వారు. దీంతో పోలీసులు బాష్పవాయు గోళాలను విద్యార్థుల పైకి ప్రయోగించారు. దీంతో ఈ ఘటనలో ఓ విద్యార్థికి ఓ తూటా తగిలి గాయమైనట్లుగా తెలుస్తోంది.

విద్యార్థులు వ్యూహాత్మకంగా నెక్లస్ రోడ్డుకు చేరుకునేందుకు ప్రయత్నాలు చేశారని అంటున్నారు. ఓ వైపు ఎన్‌సిసి గేటు వద్ద ఓ విద్యార్థి సమూహం పోలీసులతో వాగ్వాదానికి దిగడం, పరిస్థితి ఉద్రిక్తంగా మారిన నేపథ్యంలో మరో విద్యార్థి సమూహం పోలీసుల కన్ను గప్పి నెక్లస్ రోడ్డు వైపుకు వెళ్లినట్లుగా తెలుస్తోంది.

హోంమంత్రి ఇంటి ముందు ఎమ్మెల్యేల ధర్నా

తెలంగాణ రాష్ట్ర సమితి ఎమ్మెల్యేలు హోంమంత్రి సబితా ఇంద్రా రెడ్డి ఇంటి ముందు ధర్నాకు దిగారు. తెలంగాణ జిల్లాల నుండి కవాతుకు తరలి వస్తున్న తెలంగాణవాదులను పోలీసులు అరెస్టు చేస్తోందని, వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ వారు ఆందోళన చేపట్టారు. దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసులు ఎమ్మెల్యేలను అదుపులోకి తీసుకున్నారు. కవాతుకు ఎలాంటి ఆటంకం కలిగించవద్దని, అరెస్టులు చేయవద్దని పోలీసులను ఆదేశించినట్లు సబితా ఇంద్రా రెడ్డి చెప్పారు.

ప్రభుత్వం మాట తప్పినా మేం తప్పం.. కోదండరామ్

తెలంగాణ కవాతుపై ప్రభుత్వం మాట తప్పినా తాము మాట తప్పమని తెలంగాణ రాజకీయ ఐక్య కార్యాచరణ సమితి చైర్మన్ ఆచార్య కోదండరామ్ అన్నారు. తెలంగాణవాదులుగా మేం మాట తప్పేది లేదన్నారు. అరెస్టు చేసిన తెలంగాణవాదులను వెంటనే విడుదల చేయాలని, సాయంత్రం వేదిక పై నుండే కార్యాచరణ ప్రకటిస్తామని, తెలంగాణ ప్రజల ఆకాంక్షను ప్రపంచానికి తెలియజేస్తామని అన్నారు.

ఉస్మానియా విశ్వవిద్యాలయంతో పాటు హైదరాబాదు, తెలంగాణ జిల్లాల్లో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. సికింద్రాబాద్ క్లాక్ టవర్ వద్ద న్యూడెమోక్రసీ కార్యకర్తలను పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నెక్లస్ రోడ్డులో ధూంధాం నిర్వహిస్తున్న వారిని, ప్రసాద్ ఐమాక్స్ ప్రాంతంలో ర్యాలీగా వస్తున్న తెలంగాణవాదులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కవాతుకు అనుమతి ఉన్నప్పటికీ ర్యాలీగా వస్తే మాత్రం అనుమతించేది లేదని పోలీసులు చెబుతున్నారు.

English summary
Telangana JAC chairman Kodandaram alleged that police are stopping and arresting telanganites in Telangana districts.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X