పేలిన కారు టైరు: ఎమ్మెల్యేకు తప్పిన ప్రమాదం

రోడ్డు ప్రమాదంలో మాజీ ఎమ్మెల్యేకి గాయాలు
నల్గొండ జిల్లాలో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో మాజీ ఎమ్మెల్యేకు స్వల్ప గాయాలయ్యాయి. జిల్లాలోని చివమెల గ్రామం వద్ద ఈ ప్రమాదం జరిగింది. ఖమ్మం జిల్లా మధిర మాజీ ఎమ్మెల్యే వెంకటనర్సయ్యకు గాయాలయ్యాయి. వెంటనే ఆయనను హైదరాబాదులోని అపోలో ఆసుపత్రికి తరలించారు.
ప్రమాదంలో ఆయన తుంటి ఎముక విరిగినట్లు బంధువులు తెలిపారు. వెంకటనర్సయ్య ప్రయాణిస్తున్న కారును లారీ ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. పోలీసులు లారీ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. విచారణ జరుపుతున్నారు.
అనంతపురం జిల్లాలోని గోరంట్ల మండలం మల్లాపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో పద్నాలుగు మంది గాయపడ్డారు. పాలవ్యాన్, క్రూయిజర్ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. బాధితులను వెంటనే దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు.












Click it and Unblock the Notifications