హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

శంకరన్నకు హైకోర్టు షాక్: అరెస్టు వారంట్‌పై స్టే ఎత్తివేత

By Pratap
|
Google Oneindia TeluguNews

P Shankar Rao
హైదరాబాద్: గ్రీన్ ఫీల్డ్ భూముల వ్యవహారంలో మాజీ మంత్రి, కాంగ్రెసు సీనియర్ శానససభ్యుడు పి. శంకరరావుకు హైకోర్టు షాక్ ఇచ్చింది. ఈ కేసులో శంకరరావుపై జారీ అయిన అరెస్టు వారంట్‌పై ఉన్న స్టేను హైకోర్టు కొట్టేసింది. దీంతో శంకరరావును ప్రశ్నించేందుకు సైబరాబాద్ పోలీసులు సిద్ధమవుతున్నారు.

శంకరరావుతో పాటు ఆయన సోదరుడు దయానంద్‌ను సైబరాబాద్ పోలీసులు ప్రశ్నించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. హైదరాబాదు సమీపంలోని ఆల్వాల్ మున్సిపల్ పరిధిలోని కనాజిగుడా గ్రామానికి చెందిన 875 ప్లాట్లను రెగ్యులరైజ్ చేసే విషయంలో గ్రీన్ ఫీల్డ్ ఓనర్స్ అసోసియేషన్‌కు చెందిన 75 ఎకరాల భూమిని కబ్జా చేసిందుకు ప్రయత్నించారని కాలనీవాసులు శంకరరావుపై ఫిర్యాదు చేశారు.

గ్రీన్‌ఫీల్డ్ ఓనర్స్ అసోసియేషన్ కాలనీవాసులు చేసిన ఫిర్యాదు మేరకు శంకరరావుపై మల్కాజిగిరి పోలీసులు కేసు నమోదు చేశారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆస్తులపై హైకోర్టుకు లేఖ రాసి సిబిఐ దర్యాప్తు దాకా తీసుకుని వెళ్లడం ద్వారా శంకరరావు వార్తల్లో ముఖ్యమైన నేతగా మారిపోయారు.

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గంలో చేరి ఆ తర్వాత ఉద్వాసనకు గురయ్యారు. మంత్రి పదవి నుంచి వైదొలిగిన తర్వాత ఆయన ప్రతి రోజూ ఏదో విధమైన వ్యాఖ్యలతో వార్తల్లో నలుగుతున్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై ఆయన ఎప్పటికప్పుడు తాజా ఆరోపణలు చేస్తూ సంచలనం సృష్టిస్తున్నారు.

English summary
High Court has vacated stay on issued arrest warrant to former minister and Congress senior MLA P Shankar Rao in Green Field land case. It is saif that Cyberabad police may question Shankar Rao.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X