టీ20 కెప్టెన్ సూర్యపై వేటు ? రేసులో ఆ ఇధ్దరు..! అతనికే ఛాన్స్ ?
భారత్ కు తాజాగా టీ20 వరల్డ్ కప్ అందించిన కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ (suryakumar yadav) కెప్టెన్సీపై వేటు పడబోతోందా ? ఐపీఎల్ లో అతని చెత్త ప్రదర్శనే ఇందుకు కారణం కాబోతోందా ? స్కై స్ధానంలో మరో ఇద్దరు పోటీ దారులు తయారయ్యారా ? వారిలో ఒకరిని త్వరలో జరిగే ఐర్లాండ్ పర్యటనకు బీసీసీఐ కెప్టెన్ గా ఎంపిక చేయబోతోందా ? అంటే అవుననే సమాధానమే వస్తోంది. దీంతో సూర్య ఫామ్, కెప్టెన్సీ మరోసారి చర్చనీయాంశమయ్యాయి.
టీ20 కెప్టెన్ సూర్యపై వేటు ?
ప్రస్తుతం టీమిండియాలో చోటే కాదు కెప్టెన్సీకి కూడా గట్టిపోటీ నెలకొంది. ముఖ్యంగా ఐపీఎల్ వంటి టోర్నీ ద్వారా బయటపడుతున్న ఆటగాళ్ల, కెప్టెన్ల బలాలు, బలహీనతలు సెలెక్టర్లను ఆలోచనలో పడేస్తున్నాయి. దీంతో భారత్ కు వరల్డ్ కప్ తాజాగా టీ20 వరల్డ్ కప్ అందించిన కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ పైనా స్కానింగ్ మొదలైంది. ముఖ్యంగా ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ కు ఆడుతున్న స్కైలో వరల్డ్ కప్ జోష్ ఏమాత్రం కనిపించడం లేదు. దీంతో సూర్యపై వేటు వేసేందుకు సెలెక్టర్లు సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది.

రేసులో శాంసన్, అయ్యర్
సూర్య కుమార్ యాదవ్ స్ధానంలో ప్రస్తుతం ఐపీఎల్ లో పంజాబ్ కెప్టెన్ గా రాణిస్తున్న శ్రేయస్ అయ్యర్ తో పాటు చెన్నై సూపర్ కింగ్స్ ఓపెనర్, వికెట్ కీపర్ సంజూ శాంసన్ భారత టీ20 జట్టు కెప్టెన్ గా తెరపైకి వస్తున్నారు. భారత జట్టు జూన్-జూలై నెలల్లో ఇంగ్లాండ్, ఐర్లాండ్‌లలో పర్యటించనుంది. ఈ టూర్లకు జట్టు ఎంపిక ఐపీఎల్ ప్రదర్శనలపై ఎక్కువగా ఆధారపడి ఉంటుంది. ఈ విషయంలో సూర్యకుమార్ యాదవ్ ప్రదర్శన చాలా పేలవంగా ఉంది. అయితే సంజు సామ్సన్ మరియు శ్రేయస్ అయ్యర్ ఇద్దరూ అత్యధిక పరుగులు చేసిన వారిలో ఉన్నారు.

సంజూ శాంసన్ కు ఛాన్స్
ఐపీఎల్ సీజన్‌కు ముందు చెన్నై సూపర్ కింగ్స్ లో చేరినప్పటి నుండి సంజూ అద్భుతమైన ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. చెన్నై కెప్టెన్ కానప్పటికీ, రాజస్థాన్ రాయల్స్‌కు నాయకత్వం వహించిన అతని గత అనుభవం, కెప్టెన్‌గా అతనికున్న పేరుప్రతిష్టలు అతన్ని పోటీలో నిలబెట్టినట్లు కనిపిస్తున్నాయి. దైనిక్ జాగరణ్ నివేదిక ప్రకారం, భారత తదుపరి టీ20ఐ కెప్టెన్‌గా సూర్యకుమార్ స్థానాన్ని భర్తీ చేసే రేసులో సామ్సన్‌కు అనుకూలంగా ఉన్న అంశం, అతను భారత టీ20 జట్టులో నిలకడగా ఉండటమే. 2024 టీ20 ప్రపంచ కప్ నుండి సంజూ జట్టులో ఉన్నాడు, అలాగే అంతర్జాతీయ వేదికపై తనను తాను నిరూపించుకున్నాడు. 62 మ్యాచ్‌లలో మూడు సెంచరీలు , ఆరు హాఫ్ సెంచరీలతో సహా 1,399 పరుగులు చేశాడు. ఈ ఏడాది ప్రారంభంలో భారత్ టీ20 ప్రపంచ కప్ గెలవడంలో కూడా సంజూ కీలక పాత్ర పోషించాడు. అయ్యర్ ఈ సీజన్‌లో ఐపీఎల్‌లో పంజాబ్ కింగ్స్ తరఫున మంచి ఫామ్‌లో ఉండి పరుగులు సాధిస్తున్నప్పటికీ, అతను టీ20 అంతర్జాతీయ జట్టుకు దూరంగా ఉండటం మైనస్ కానుంది. అయ్యర్ డిసెంబర్ 2023లో టీమిండియా తరఫున చివరి టీ20 ఆడాడు. దీంతో శాంసన్ కు కెప్టెన్సీ అవకాశాలు కనిపిస్తున్నాయి.












Click it and Unblock the Notifications