జగన్ కేసు: మంత్రులకు, అధికారులకు సుప్రీం డెడ్‌లైన్

కౌంటర్ దాఖలు చేయాలని వారిని ఆదేశించింది. కానీ ఇప్పటి వరకు ఐఏఎస్ అధికారిణి రత్నప్రభ మాత్రమే కౌంటర్ దాఖలు చేశారు. దీంతో సుప్రీం కోర్టు మంగళవారం మంత్రులకు, అధికారులకు సుప్రీం కౌంటర్ దాఖలుపై డెడ్ లైన్ విధించింది. డిసెంబర్ 3వ తేదీలోగా దాఖలు చేయాలని ఆదేశించింది. సుప్రీంకోర్టు ఆదేశాలకు సంబంధించి నోటీసులను స్వయంగా అందజేస్తానని న్యాయవాది సుధాకర్ రెడ్డి కోర్టుకు విజ్ఞప్తి చేయడంతో కోర్టు కూడా అంగీకరించింది.
శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకు చెందిన న్యాయవాది సుధాకర్ రెడ్డి వివాదాస్పద 26 జివోలకు సంబంధించి సంబంధిత మంత్రులను కూడా విచారించాలని గతంలో సుప్రీం కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించి ఆరుగురు మంత్రులకు నోటీసులు జారీ చేసింది. మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ ఇప్పటికే జైలులో ఉన్నారు. మరో మంత్రి ధర్మాన ప్రసాద రావు రాజీనామా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వద్ద పెండింగ్‌లో ఉంది.












Click it and Unblock the Notifications