జగన్ ఎక్స్‌పీరియన్స్: షర్మిల, బాబులకు వార్నింగ్

హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిల రెడ్డి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తెలంగాణ ప్రాంతంలో తమ పాదయాత్ర జరిగే సమయంలో తెలంగాణవాదుల నుండి ప్రతిఘటన ఎదుర్కొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. తెలంగాణపై ఇప్పటి వరకు టిడిపి, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలు స్పష్టత ఇవ్వలేదనే చెప్పవచ్చు. దీంతో వారిని బాబు, షర్మిలను అడ్డుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.

చెప్పలేని స్థితిలో జగన్ పార్టీ 4

చెప్పలేని స్థితిలో జగన్ పార్టీ 4

గతంలో వైయస్ జగన్మోహన్ రెడ్డి ఓదార్పు కోసం వరంగల్ జిల్లా మహబూబాబాద్‌కు వచ్చారు. అయితే అంతకుముందు తెలంగాణకు వ్యతిరేకంగా లోకసభలో ప్లకార్డులు పట్టుకోవడంతో జగన్‌ను తెలంగాణవాదులు అడ్డుకున్నారు. అయితే అప్పుడు జగన్ కాంగ్రెసు పార్టీలో ఉన్నారు.

ఖరారు కానీ రోడ్డు మ్యాప్ 5

ఖరారు కానీ రోడ్డు మ్యాప్ 5

షర్మిల ఈ నెల 18వ తేది నుండి మరో ప్రజా ప్రస్థానం పేరిట కడప జిల్లా ఇడుపులపాయ నుండి పాదయాత్ర ప్రారంభిస్తున్నారు.

స్పష్టత అని చెప్పినప్పటికీ

స్పష్టత అని చెప్పినప్పటికీ

ఇక తెలుగుదేశం పార్టీ తెలంగాణపై తాము స్పష్టత ఇచ్చామని చెప్పినప్పటికీ దానిని తెలంగాణ ప్రజలు నమ్మడం లేదనే చెప్పవచ్చు. తెలంగాణ కోసం అప్పటి కేంద్ర హోంమంత్రి చిదంబరంకు టిడిపి అనుకూలమంటూ లేఖ ఇచ్చింది.

సాధారణ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో...

సాధారణ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో...

సాధారణ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో తెలంగాణవాదులు తమ ఉద్యమాన్ని మరింత ఉధృతంగా చేస్తారు. 2014లోపు తెలంగాణ సాధించాలనే లక్ష్యంతో పార్టీలకతీతంగా తెలంగాణ నేతలు కూడా పని చేస్తున్నారు.

చెప్పలేని స్థితిలో జగన్ పార్టీ 4

గతంలో వైయస్ జగన్మోహన్ రెడ్డి ఓదార్పు కోసం వరంగల్ జిల్లా మహబూబాబాద్‌కు వచ్చారు. అయితే అంతకుముందు తెలంగాణకు వ్యతిరేకంగా లోకసభలో ప్లకార్డులు పట్టుకోవడంతో జగన్‌ను తెలంగాణవాదులు అడ్డుకున్నారు. అయితే అప్పుడు జగన్ కాంగ్రెసు పార్టీలో ఉన్నారు. ఇంకా సొంత కుంపటి పెట్టలేదు. అయితే పార్టీ పెట్టాక తెలంగాణపై ఆయన తన పార్టీ నిర్ణయాన్ని తెలపాల్సి ఉన్నప్పటికీ ఇప్పటికీ తెలియలేదు.

దీంతో జగన్‌ను అడ్డుకుంటామని పలుమార్లు తెలంగాణవాదులు ఆ తర్వాత హెచ్చరించారు. మహబూబ్‌నగర్ ఘటన జగన్ తన ఓదార్పు యాత్రను కేవలం సీమాంధ్ర ప్రాంతానికే పరిమితం చేశారు. తొలుత చేసిన పలు దీక్షలు కూడా హైదరాబాద్, సీమాంధ్రలోనే చేశారు. ఆ తర్వాత పరిస్థితి కాస్త సద్దుమణిగాక నిజామాబాద్ జిల్లాలో పర్యటించారు. ఆస్తుల కేసులో అరెస్టై జగన్ జైలుకు వెళ్లాక పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైయస్ విజయమ్మ సిరిసిల్లలో చేనేత దీక్ష చేపట్టారు.

లోకసభలో జగన్ తెలంగాణ వ్యతిరేక ప్లకార్డు పట్టుకున్న విషయాన్ని పలుమార్లు తెలంగాణవాదులు గుర్తు చేస్తున్నారు. పార్టీ అభిప్రాయం చెబితే దానిని మర్చిపోతామంటున్నారు. కానీ ఇప్పటి వరకు వారు ఎలాంటి ప్రకటన చేయలేదు. తెలంగాణ తాము ఇచ్చే స్థితిలో ఇప్పించే స్థితిలో లేమని చెప్పి చేతులు దులుపుకుంటున్నారు. ఇది తెలంగాణవాదులకు రుచించడం లేదు. అయితే సెంటిమెంట్ కారణంగా జగన్ పార్టీ ప్రభావం తెలంగాణలో బాగానే ఉంది. అది ఇటీవల జరిగిన పరకాల ఉప ఎన్నికలలో రుజువైంది కూడా.

జగన్ తెలంగాణ వ్యతిరేక ప్లకార్డు కాంగ్రెసులో ఉన్నప్పుడు పట్టుకున్నారని, ఇప్పుడు సొంత పార్టీ పెట్టారని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేతలు చెబుతున్నారు. తెలంగాణకు వ్యతిరేకం కాదని, ఈ ప్రాంత ప్రజల మనోభావాలను గౌరవిస్తామని వారు చెబుతున్నారు. కానీ పార్టీ నిర్ణయాన్ని మాత్రం ఇప్పటి వరకు చెప్పలేదు. తెలంగాణవాదులు మాత్రం పార్టీ నిర్ణయాన్ని చెప్పిన తర్వాతనే తెలంగాణలో షర్మిలను యాత్ర చేయనిస్తామని హెచ్చరిస్తున్నారు.

ఖరారు కానీ రోడ్డు మ్యాప్ 5

షర్మిల ఈ నెల 18వ తేది నుండి మరో ప్రజా ప్రస్థానం పేరిట కడప జిల్లా ఇడుపులపాయ నుండి పాదయాత్ర ప్రారంభిస్తున్నారు. తెలంగాణ జిల్లాలోనూ ఆమె పర్యటన ఉంటుంది. కానీ ఇంకా రోడ్డు మ్యాప్ సిద్ధం కాలేదు. అయితే ఆమె ఎప్పుడు తెలంగాణాలో అడుగుపెట్టినా షర్మిల యాత్రను అడ్డుకునేందుకు మాత్రం తెలంగాణవాదులు సిద్ధంగా ఉన్నారు. తెలంగాణపై నిర్ణయాన్ని చెప్పకుండా షర్మిల వస్తే మహబూబాబాద్ పునరావృతమవుతుందని ఇప్పటికే తెలంగాణవాదులు హెచ్చరిస్తున్నారు.

స్పష్టత అని చెప్పినప్పటికీ

ఇక తెలుగుదేశం పార్టీ తెలంగాణపై తాము స్పష్టత ఇచ్చామని చెప్పినప్పటికీ దానిని తెలంగాణ ప్రజలు నమ్మడం లేదనే చెప్పవచ్చు. తెలంగాణ కోసం అప్పటి కేంద్ర హోంమంత్రి చిదంబరంకు టిడిపి అనుకూలమంటూ లేఖ ఇచ్చింది. దానిని ఉపసంహరించుకోలేదు. అయితే 2009 డిసెంబర్ 9న తెలంగాణ ప్రకటన చేసిన తర్వాత రోజు చంద్రబాబు మాట్లాడుతూ.. అర్ధరాత్రి ప్రకటనలు అంటూ కేంద్రం నిర్ణయాన్ని గర్హించారు. దీంతో బాబు తెలంగాణ వ్యతిరేకిగా ముద్రపడ్డారు.

తెలంగాణకు అనుకూలంగా మరోసారి లేఖ ఇవ్వాలని తెలంగాణవాదులు డిమాండ్ చేస్తుండగా, టిడిపి మాత్రం తాము ఇప్పటికే లేఖ ఇచ్చామని, మరోసారి ఇవ్వాల్సిన అవసరం లేదని చెబుతోంది. దీంతో తెలంగాణపై ఆ పార్టీ వైఖరి ఏమిటో అర్థం కాకుండా ఉందని పలువురు చెబుతున్నారు. టిడిపి తెలంగాణకు అనుకూలంగా ఉందని చెప్పాలంటే మరోసారి లేఖ ఇవ్వాల్సిందేనని తెలంగాణవాదుల వాదన. అనుకూలంగా లేఖ ఇస్తే సీమాంధ్రలో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందనే టిడిపి భావిస్తోంది. జగన్ పార్టీ కూడా అదే భావనలో ఉంది. అందుకే ఆ రెండు పార్టీలు తెలంగాణపై స్పష్టమైన వైఖరి చెప్పడం లేదు.

సాధారణ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో...

సాధారణ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో తెలంగాణవాదులు తమ ఉద్యమాన్ని మరింత ఉధృతంగా చేస్తారు. 2014లోపు తెలంగాణ సాధించాలనే లక్ష్యంతో పార్టీలకతీతంగా తెలంగాణ నేతలు కూడా పని చేస్తున్నారు. దీంతో టిడిపి, కాంగ్రెసు, వైయస్సార్ కాంగ్రెసులు ఖచ్చితంగా తెలంగాణ సెగను ఎదుర్కొంటాయి. పార్టీ బలోపేతం కోసం పాదయాత్ర చేస్తున్న బాబు, షర్మిలకు కూడా ఈ సెగ ఖచ్చితంగా తగిలే అవకాశముంది.

పరకాల ఉప ఎన్నికల సమయంలో, సిరిసిల్ల దీక్ష సమయంలో తెలంగాణ సెగ తగలలేదని కొందరు చెబుతున్నప్పటికీ అప్పటి పరిస్థితి వేరు ఇప్పటి పరిస్థితి వేరని చెబుతున్నారు. జగన్ జైలుకు వెళ్లడం తదితర సెంటిమెంట్స్ ఆ పార్టీకి అప్పుడు కలిసి వచ్చిందని, అందుకే వారిని అడ్డుకునే ప్రయత్నాలు తెలంగాణవాదులు చేయలేదని, ఇప్పుడు మాత్రం అలాంటిదేమీ ఉండదని చెబుతున్నారు. కాంగ్రెసు ఎంపీలు కూడా షర్మిల, బాబులను అడ్డుకుంటామని హెచ్చరిస్తుండటం గమనార్హం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+