లవర్స్ ఛేజ్: ప్రియురాలు మృతి, ప్రియుడికి గాయాలు

తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట సమీపంలో సోమవారం తెల్లవారుజామున ఈ ఘటన చోటుచేసుకుంది. అమలాపురంలోని గొల్లగూడెంకు చెందిన హోల్‌సేల్ కిరాణా వ్యాపారి రేపాక వెంకటేశ్వరరావు కూతురు ప్రియాంక బీటెక్ రెండవ సంవత్సరం చదువుతోంది. అమలాపురంనకు చెందిన శ్రీదేవి లాడ్జి యజమాని మనుమడు కార్తీక్ కూడా అదే కళాశాలలో బీటెక్ చదువుతున్నాడు. వీరిద్దరు పెళ్ళి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. దీనితో ఇంట్లో నుండి వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నారు.
కార్తీక్ స్నేహితుడు సుధాకర్‌కు చెందిన మారుతీ జెన్‌లో సోమవారం వేకువజామున హైదరాబాద్ బయల్దేరారు. వీరితో పాటు కార్తీక్ మరో స్నేహితుడు పోతుల ఏసురత్నం కూడా వీరికి సహాయంగా బయల్దేరాడు. కొత్తపేట షిరిడీ సాయిబాబా ఆలయం దాటిన తరువాత వీరు ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి, ముక్తేశ్వరం ప్రధాన పంట కాల్వలోకి దూసుకుపోయి, బోల్తాపడింది. ఈ ప్రమాదం నుండి కార్తీక్, ఏసురత్నం సురక్షితంగా బయటపడగా, కారులోనే ఉండిపోయిన ప్రియాంక (20), సుధాకర్ (20) మృతిచెందారు.
సోమవారం ఉదయం కారును బయటకు తీస్తుండగా సుధాకర్ మృతదేహం బయటపడింది. ప్రియాంక మృతదేహం మాత్రం కాల్వలో కొట్టుకుపోయి సిరిపల్లి వద్ద లభించింది. అమలాపురం డిఎస్‌పి శ్రీధర్ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. వారు పట్టుకెళుతున్న బ్యాగుల్లో రూ.30 లక్షలకు పైగా నగదును పోలీసులు గుర్తించారు. ఈ మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు డిఎస్‌పి శ్రీధర్ తెలిపారు.












Click it and Unblock the Notifications