ప్రధాని పర్యటన: ఆంక్షలు, ఐటి కంపెనీలపై ఎఫెక్ట్

Manmohan Singh
హైదరాబాద్‌: ప్రధాని హైదరాబాద్ పర్యటన ప్రభావం సైబరాబాద్‌పై పడింది. తెలంగాణ ఆందోళన భయంతో మంగళవారం సగం రోజు సైబరాబాద్‌ను మూసేసినట్లే చేశారు. ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్‌లో జరుగుతున్న జీవ వైవిధ్య సదస్సుకు ప్రధాని మన్మోహన్ సింగ్ వస్తున్నారు. దీంతో హైదరాబాద్‌లో భారీా భద్రతా ఏర్పాట్లు చేశారు. దీంతో విద్యాసంస్థలు, ఐటి సంస్థలు, వాణిజ్య సంస్థలపై తీవ్రం ప్రభావం పడుతోంది. కొన్ని విద్యాసంస్థలు సెలవు ప్రకటించాయి. పలు ఐటి కంపెనీలు తమ పనివేళలను మార్చుకున్నాయి. తెలంగాణ ఆందోళన భయంతోనే ప్రధాని పర్యటనకు కనీవినీ ఎరుగని రీతిలో భద్రతా ఏర్పాట్లు చేసినట్లు భావిస్తున్నారు.

ఢిల్లీ నుంచి మంగళవారం మధ్యాహ్నం రెండున్నర గంటలకు ప్రధాని హైదరాబాద్‌ చేరుకుంటారు. అక్కడి నుంచి బయోడెై వర్సిటీ పార్క్‌కు చేరుకుని బయోడెై వర్సిటీ పైలాన్‌ను ఆవిష్కరిస్తారు. పైలాన్‌ ఆవిష్కరణ అనంతరం రిజర్వ్‌ సమయంలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డితో ఆయన చర్చలు జరిపే అవకాశం ఉన్నది. మధ్యాహ్నం 3.30 గంటల నుంచి 4.10 గంటల వరకు బయోడెైవర్సిటీ సదస్సులో పాల్గొంటారు. 4.45 గంటలకు ఆయన హైదరాబాద్‌లోని విమానాశ్రయానికి చేరుకుని తిరిగి ఢిల్లీకి బయలుదేరుతారు.

ప్రధాని డాక్టర్‌ మన్మోహన్‌ సింగ్‌ రాక సందర్బంగా నగరంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. భారీగా పోలీసులను మోహరించి అడుగడుగునా గస్తీ ముమ్మరం చేశారు. హెచ్‌ఐసీసీ, బేగంపేట్‌ ఏయిర్‌పోర్టు ప్రాంగణాల్లో తనిఖీలను ముమ్మరం చేశారు. ఏ మాత్రం అనుమానం కలిగినా అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ప్రధాని రా సందర్బంగా తెలుగుదేశం, తెలంగాణ రాష్ట్ర సమితి కార్యకర్తలు, తెలంగాణవాదులు ఆందోళనలకు సిద్ధం అవుతుండటం, ప్రధాని పర్యటనను అడ్డుకుని నిరసన వ్యక్తంచేస్తామని తెలంగాణ రాజకీయ జేఏసీ చెైర్మన్‌ కోదండరాం హెచ్చరికలు జారీ చేయడంతో పోలీసులు మరింత అప్రమత్తమయ్యారు.

ప్రధాని పర్యటించే ప్రాంతాల్లో మంగళవారం ఎలాంటి నిరసన కార్యక్రమాలు జరగకుండా పోలీసులు భారీగా సన్నాహాలు చేశారు. ముఖ్యమంత్రి ఎన్‌.కిరణ్‌కుమార్‌రెడ్డి, హోంమంత్రి పి.సబితారెడ్డి, డీజీపీ దినేష్‌రెడ్డి, హైదరాబాద్‌, సైబరాబాద్‌ పోలీసు కమిషనర్‌లు అనురాగ్‌శర్మ, ద్వారకా తిరుమలరావులు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించారు. కాగా, బేగంపేట నుంచి హెచ్‌ఐిసీసీ వరకూ ట్రాఫిక్‌ ఆంక్షలను విధించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+