నల్లబ్యాడ్జితోనే షర్మిల యాత్ర: విజయమ్మ, బాబుపై ఫైర్

జగన్‌కు బెయిల్ రాకుండా అడ్డుకునే కుట్ర జరుగుతుందని ఆమె ఆరోపించారు. బెయిల్ వస్తుందనుకున్న ప్రతిసారి సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సిబిఐ) ఏదో ఒక ఛార్జీషీట్ వేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రంలో చక్రం తిప్పానని గొప్పలు చెప్పుకుంటున్న తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారని ప్రశ్నించారు. ఆయన పాలన బాగుంటే ఇప్పుడు పాదయాత్ర చేయాల్సి వచ్చేది కాదు కదా అన్నారు.
ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్ర ప్రజల సంక్షేమాన్ని ఎందుకు విస్మరించారో చెప్పాలన్నారు. వ్యవస్థలను భ్రష్టు పట్టించిన ఘనత చంద్రబాబుదే అన్నారు. అధికారంలోకి వస్తే బెల్టు దుకాణాలను తొలగిస్తానని చంద్రబాబు అంటున్నారని, కానీ వాటికి మూలకారకులు ఆయనే అని, ఆ విషయాన్ని చంద్రబాబు మరిచిపోతున్నారా అన్నారు. షర్మిల పాదయాత్రకు అనూహ్య స్పందన వస్తోందన్నారు.
కాగా షర్మిల పాదయాత్ర సోమవారం లోపట్నూతల క్రాస్ రోడ్డు నుండి ప్రారంభమైంది. ఉదయం 9.30 నిమిషాలకు ఆమె పాదయాత్ర ప్రారంభమైంది. కర్నపాపాయపల్లి, తాతిరెడ్డిపల్లె క్రాస్ మీదుగా మధ్యాహ్నం వెలిదండ్లకు చేరుకుంది. దంతాలపల్లి క్రాస్, నేర్జాంపల్లి వరకు షర్మిల పాదయాత్ర ఈరోజు కొనసాగుతుంది.












Click it and Unblock the Notifications