సూకీకోసం సీమ రుచులు రెడీ: పాపసానిపల్లి ముస్తాబు

పాపసానిపల్లి అనంతపురం జిల్లాలోని కర్నాటక-ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల్లో ఉంది. ఈ గ్రామంలో 16 మహిళా సంఘాలు ఉన్నాయి. ఈ గ్రామం అదర్శ గ్రామంగా నిలిచింది. దీంతో దీన్ని సందర్శించేందుకు సూకీ వస్తున్నారు. జిల్లా అధికాలులు మాట్లాడుతూ.. తాము సూకీకి రాయలసీమ తీపి పదార్థాలు రుచి చూపిస్తామని చెబుతున్నారు. కజ్జికాయలు, రవ్వ లడ్డు, అత్తి రసాలు, కొడుబాలే, రాగి, జొన్న, సబ్జి రోటీ తదితరాలను ఆమెకు ఆఫర్ చేస్తామని చెబుతున్నారు.
డిఆర్‌డిఏ అధికారులు ధర్మవరం సిల్క్ బట్టలను బహూకరించనున్నట్లు చెప్పారు. సూకీతో పాటు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జైరాం రమేష్, పలువురు రాష్ట్ర మంత్రులు రానున్నారు. దీంతో సూకీతో పాటు మిగిలి వారికీ ఆహ్వాన బ్యానర్లు వెలుస్తున్నాయి. స్థానిక పాఠశాలను అపురూపంగా తీర్చిదిద్దుతున్నారు. గదులకు కొత్త రంగులు వేస్తున్నారు. గ్రామానికి వెళ్లే ప్రధాన రహదారిని విస్తరించి రోడ్డు పనులు చేపట్టారు.
సూకీ వస్తున్న నేపథ్యంలో గ్రామాన్ని శుభ్రం చేసే పనుల్లో యంత్రాంగం నిమగ్నమయింది. ఆయా శాఖల అధికారులు అక్కడే మకాం వేసి పనులను పర్యవేక్షిస్తున్నారు. కాగా సూకి బెంగళూరు మీదుగా ఉదయం 9.20 నిమిషాలకు పాపసానిపల్లికి రానున్నారు. పాపసానిపల్లి బెంగళూరుకు 110 కిలోమీటర్ల దూరంలో ఉంది.
-
విజయ్ కు డిప్యూటీ సీఎం, 80 సీట్లు ఆఫర్? -
employees: ఉద్యోగులకు భారీ గుడ్ న్యూస్-ఒక్క దెబ్బకు డీఏ బకాయిలన్నీ క్లియర్..! -
మహేశ్‌కు శ్రీలీల స్వీట్ వార్నింగ్! -
West Bengal Survey: బెంగాల్లో అనూహ్య ఫలితాలు?-తేల్చేసిన మ్యాట్రిజ్ సర్వే..! -
అందుకే.. విజయ్ జన నాయగన్ డిలే అయింది: పవన్ కల్యాణ్ -
ఉగాది ఎప్పుడు చేసుకోవాలి 19 లేక 20 తేదీనా - వరుస సెలవులపై తాజా నిర్ణయం..!! -
వైసీపీలోకి సీనియర్ నేత రీ ఎంట్రీ, అదే బాటలో..!! -
నోబుల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో అల్లు అర్జున్ కుమార్తె..! -
ఏపీ మీదుగా బెంగళూరు, చెన్నై ప్రత్యేక రైళ్లు.. ఇకపై: హాల్ట్ స్టేషన్లు -
డిప్యూటీ సీఎం ఆఫర్ వేళ విజయ్, బీజేపీకి అన్నాడీఎంకేేే బిగ్ షాక్..! -
ఉగాదికి ముందే వారి కల నెరవేరుస్తున్న చంద్రబాబు.. మాట నిలబెట్టుకున్నారుగా! -
కుప్పకూలుతున్న పసిడి ధరలు- భారీగా క్రాష్












Click it and Unblock the Notifications