• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

వన్డేలో చెడగొట్టారు, జగన్‌గేమ్:పయ్యావుల కంటకన్నీరు

By Srinivas
|
Payyavula keshav
హైదరాబాద్: తాను వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరతానని ఆ పార్టీ నేతలు అమర్నాథ్ రెడ్డి, శ్రీనివాసులు ప్రమాణం చేసి చెప్పగలరా అని తెలుగుదేశం పార్టీ నేత పయ్యావుల కేశవ్ మంగళవారం ఉదయం అన్నారు. పయ్యావుల కేశవ్ వైయస్సార్ కాంగ్రెసు పార్టీలోకి వెళుతున్నట్లుగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ వార్తలను ఆయన ఖండించారు. మీడియా సమక్షంలో కంటతడి పెట్టుకున్నారు.

తాను జగన్ పార్టీలోకి వెళుతున్నట్లుగా జరుగుతున్న ప్రచారం వట్టిదే అన్నారు. తాను ఉదయం వార్తలు చూడగానే కంట నీరు వచ్చిందన్నారు. తనకు పార్టీలో మంచి గౌరవం ఉందన్నారు. ఇలాంటి ప్రచారం తనలో మరింత ఉత్సాహాన్ని నింపిందని, తాను వైయస్సార్ కాంగ్రెసు పార్టీ పైన, జగన్ అవినీతి పైన పోరాటం సాగిస్తానని చెప్పారు. వైయస్ జగన్ ఆయా జిల్లాల్లో బలమైన నేతలను టార్గెట్ చేసుకొని మైండ్ గేమ్ ఆడుతున్నారని విమర్శించారు.

మాట్లాడుతున్న సమయంలో పయ్యావుల రెండుమూడుసార్లు ఉద్వేగానికి గురై కన్నీరు పెట్టుకున్నారు. ఇప్పుడున్న రాజకీయ వాతావరణంలో తాను పార్టీ మారుతాననే ప్రచారం బాధ కలిగించిందన్నారు. ఇదంతా గ్లోబెల్ ప్రచారం అన్నారు. ఇలాంటి గ్లోబల్స్ ప్రచారం వల్ల వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి తాత్కాలికంగా లబ్ధి పొందవచ్చు. కానీ భవిష్యత్తులో మాత్రం టిడిపికే లాభం అన్నారు. సంక్షోభం తలెత్తిన పలు సందర్భాలలో టిడిపి ఉవ్వెత్తున ఎగిసిందన్నారు.

ఇప్పుడు అలాగే ఉంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. తాను సంపాదనపై ఆశలేకుండా రాజకీయాల్లో కొనసాగుతున్నానని, తనకు ఎలాంటి వ్యాపారాలు లేవన్నారు. తెలుగుదేశం పార్టీ కోసం సైనికుడిగా పని చేస్తానన్నారు. వ్యూహాత్మకంగా తనను, టిడిపిని దెబ్బతీసే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. తన పద్దెనిమిదేళ్ల రాజకీయంలో విలువలతో, సిద్ధాంతాలతో, కార్యకర్తగా, సైనికుడిగా పని చేశానన్నారు. రాజకీయాల్లో కొందరిలా ఆస్తులు సంపాదించుకునేందుకు తాను ప్రయత్నించడం లేదన్నారు.

స్వర్గీయ నందమూరి తారక రామారావు తనను పిలిచి టిక్కెట్ ఇచ్చారన్నారు. 20 ఏళ్లు కష్టపడి పెంచుకున్న ప్రతిష్టను ఒక్క కథనంతో చెడకొట్టారు. తాను జీవితంలో బాధపడిన రోజుల్లో ఇది ఒకటి అన్నారు. సంక్షోభాలు వస్తే టిడిపి మరింత బలోపేతం అవుతుందన్నారు. ఉప ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గెలిచినంత మాత్రాన ఆ పార్టీలోకి వెళ్లేంత బలహీనుడిని తాను కాదన్నారు.

జగన్ తండ్రిపై తాను పోరాటం చేశానని, ఇప్పుడు జగన్ పైన చేస్తానన్నారు. తాను టిడిపి పునాదులపై పెరిగానన్నారు. అలాంటి పార్టీని వీడే ప్రసక్తి లేదన్నారు. ఆరోపణలు వచ్చినప్పుడు తన వివరణ తీసుకుంటే బాగుండునని పయ్యావుల చెప్పారు. తాను తెలంగాణ రాష్ట్ర సమితిని వీడటం లేదని ఆ పార్టీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి కూడా అన్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీపై ఆయన నిప్పులు చెరిగారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

lok-sabha-home

English summary
Telugudesam Party leader Payyavula keshav has wept on Tuesday for rumors on him that he will join in YSR Congress.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X

Loksabha Results

PartyLWT
BJP+27376349
CONG+771289
OTH986104

Arunachal Pradesh

PartyLWT
BJP20020
CONG000
OTH707

Sikkim

PartyLWT
SDF11011
SKM808
OTH000

Odisha

PartyLWT
BJD1070107
BJP26026
OTH13013

Andhra Pradesh

PartyLWT
YSRCP13812150
TDP23023
OTH202

TRAILING

Manhar Patel - INC
Bhavnagar
TRAILING
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more