నేను ఏ తప్పూ చేయలేదు: మంత్రులకు ధర్మాన లేఖ

Dharmana Prasad Rao
హైదరాబాద్: తాను ఏ తప్పూ చేయలేదని మంత్రి ధర్మాన ప్రసాద రావు అన్నారు. ఈ మేరకు ఆయన శుక్రవారం సహచర మంత్రులకు ఓ లేఖ రాశారు. శుక్రవారం సాయంత్రం మంత్రి వర్గ సమావేశం జరంగనున్న నేపథ్యంలో ఆయన ఈ లేఖ రాశారు. తన రాజీనామాపై మంత్రి వర్గ సమావేశంలో చర్చ జరిగే అవకాశం ఉందని ఆయన భావిస్తున్నారు. వాన్‌పిక్ వ్యవహారంలో తాను మంత్రి వర్గ నిర్ణయాన్నే అమలు చేశానని చెప్పుకున్నారు.

వాన్‌పిక్ వ్యవహారంలో తనను నిందితుడిగా పేర్కొంటూ సిబిఐ చార్జిషీట్ దాఖలు చేయడంతో ఆయన ఆ మధ్య మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఆ రాజీనామాను ముఖ్యమంత్రి ఆమోదించలేదు. ధర్మాన ప్రసాదరావు రాజీనామాపై మంత్రి వర్గ సమావేశంలో చర్చించిన తర్వాత ముఖ్యమంత్రి దాన్ని తిరస్కరించే అవకాశాలున్నట్లు ప్రచారం సాగుతోంది.

ఈ స్థితిలో మంత్రులకు ధర్మాన రాసిన లేఖ ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. గురువారం ధర్మాన ప్రసాద రావు ముఖ్యమంత్రిని కలిశారు. రాజీనామా చేసినప్పటి నుంచి ధర్మాన ప్రసాద రావు మంత్రి వర్గ సమావేశాలకు దూరంగా ఉంటున్నారు. మంత్రుల నుంచి నైతిక మద్దతు కోరుతూ ధర్మాన ఈ లేఖ రాశారు.

ఇలా వుంటే, ముఖ్యమంత్రిపై ఎవరికీ అసంతృప్తి లేదని వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మినారాయణ స్పష్టం చేశారు. మంత్రుల మధ్య విభేదాలు లేవని కూడా ఆయన చెప్పారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై కన్నా లక్ష్మినారాయణ అలిగినట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కన్నా లక్ష్మినారాయణ వివరణ ఇచ్చారు.

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మినారాయణ అలక వహించినట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్ నియామకం ఇరువురి మధ్య చిచ్చు పెట్టినట్లు ఓ ప్రముఖ తెలుగు దినపత్రిక రాసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+