షర్మిలకు తెలంగాణ సెగ: వైయస్సార్సీపి దాడి, ఉద్రిక్తత

Sharmila
మహబూబ్‌నగర్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ సోదరి షర్మిల పాదయాత్రకు శనివారం మహబూబ్‌నగర్ జిల్లాలో తెలంగాణ సెగ తగిలింది. మహబూబ్‌నగర్ జిల్లాలోని శాంతినగర్ వద్ద షర్మిల పాదయాత్రను తెలంగాణవాదులు అడ్డుకున్నారు. దాంతో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కార్యకర్తలు తెలంగాణవాదులపై దాడికి ప్రయత్నించారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది.

జై తెలంగాణ నినాదాలు చేస్తూ తెలంగాణపై షర్మిల తన స్పష్టమైన వైఖరి చెప్పాలని తెలంగాణవాదులు డిమాండ్ చేశారు. తెలంగాణవాదులపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కార్యకర్తల దాడికి నిరనసగా తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) విద్యార్థి విభాగం (టిఆర్ఎస్వీ) కార్యకర్తలు మహబూబ్‌నగర్ జిల్లాలోని ఐజలో రాస్తారోకో నిర్వహించారు. దీంతో వాహనాల రాకపోకలు ఆగిపోయాయి. తెలంగాణవాదులపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కార్యకర్తల దాడిని టిఆర్ఎస్వీ అధ్యక్షుడు సుమన్ ఖండించారు.

షర్మిల తప్పకుండా తెలంగాణ అనాల్సిందేనని, తెలంగాణపై షర్మిల స్పష్టమైన వైఖరి చెప్పాలని సుమన్ డిమాండ్ చేశారు. తెలంగాణవాదులపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కార్యకర్తల దాడిని తెలంగాణవాదంపై దాడిగా పరిగణిస్తామని ఆయన అన్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కార్యకర్తల దాడితో షర్మిల తెలంగాణకు వ్యతిరేకమని తేలిపోయిందని ఆయన అన్నారు.

కాగా, తన పాదయాత్రలో షర్మిల కాంగ్రెసు ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ప్రభుత్వం ప్రజా సమస్యలను పట్టించుకోవడం లేదని ఆమె అన్నారు. వైయస్ జగన్‌ను అనవసరంగా జైలులో పెట్టారని ఆమె అన్నారు. తెలుగుదేశం పార్టీ అద్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిపై కూడా ఆమె విమర్శలు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+