మహిళా టెక్కీ ఆత్మహత్య: వేధింపులతో టెక్కీ సతీమణి

వీరికి ఇద్దరు పిల్లలు. కెపిహెచ్‌బి కాలనీలో ఉంటారు. ఓ బంధువుల అమ్మాయి కూడా వీరితోపాటే ఉంటుంది. సోమవారం ఉదయం భర్త ఆఫీసుకు వెళ్లాడు. మధ్యాహ్న సమయంలో ఇంట్లోని బెడ్ రూంలోకి వెళ్లి అనిత గడియ పెట్టుకుంది. బంధువుల అమ్మాయి ఎంతగా తలుపు కొట్టినా తీయలేదు. దీంతో భర్తకు ఫోన్ చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు తలుపులు బద్దలు కొట్టి చూడగా.. అనిత చున్నీతో ఫ్యాన్‌కు ఉరి వేసుకొని కనిపించింది.
ఆమె రాసిన సూసైడ్ నోటును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వరకట్న వేధంపులతో తమ కూతురు ఆత్మహత్య చేసుకుందని అమ్మాయి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు. మరోవైపు భర్తతో తగాదా కారణంగా మరో సాఫ్టువేర్ ఇంజనీర్ ఆత్మహత్య చేసుకుంది.
బంజారాహిల్స్‌లోని రోడ్డు నెంబర్ మూడులో ఉంటున్న అనిత, నవీన్‌ల పెళ్లి నాలుగేళ్ల క్రితం జరిగింది. భార్య సాఫ్టువేర్ ఇంజనీర్‌గా పని చేస్తోంది. ఓ శుభకార్యానికి సంబంధించి గిఫ్ట్ విషయంలో భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. భర్త బయటకు వెళ్లిన తర్వాత భార్య ఆవేశంలో గదిలోకి వెళ్లి ఆత్మహత్య చేసుకుంది. బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
-
హైదరాబాద్ ప్రయాణీకులకు TGSRTC బిగ్ అప్డేట్, బస్టాపుల్లో కీలక మార్పులు..!! -
మూడు రోజులు వర్షాలు.. వరుణ సందేశం ఇచ్చిన వాతావరణ శాఖ! -
హైదరాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం.. -
HYDRA : రూ.1200 కోట్ల భూమిని కాపాడిన హైడ్రా.. -
Lockdown: ఇవాళ రాత్రి నుంచే కర్ఫ్యూ, ప్రభుత్వం సంచలన నిర్ణయం! -
ప్రపంచంలోనే అత్యధిక సైన్యం కలిగిన దేశాలు ఇవే.. మారిన లెక్కలు.. -
ఒక్క పోస్టుతో అందరికీ ఇచ్చిపడేసిన "త్రిష".. -
సింహరాశి, కన్యారాశి మే నెల జాతక ఫలం -
తిరుపతికి కొత్తగా అమృత్ భారత్, వందేభారత్ స్లీపర్ - రూట్, షెడ్యూల్ ఫిక్స్..!! -
ఉపాసన, కావ్య మారన్ కు సీఎం రేవంత్ కీలక బాధ్యతలు..!! -
Snakes and Crocodiles:పాములు,మొసళ్లతో గస్తీ-బీఎస్ఎఫ్ కొత్త ప్లాన్..!! -
ఏమిటీ వింత? తెల్ల పులికి పుట్టిన పసుపు పిల్లలు..












Click it and Unblock the Notifications