కడప ఎక్సైజ్ కానిస్టేబుల్ పరుగు పందెం: అభ్యర్థి మృతి

సంజీవ్ జిల్లాలోని చిన్నమండెం మండలంకు చెందిన మల్లూరు గ్రామవాసి. అతను మృతి చెందగానే పోలీసులు తల్లిదండ్రులకు సమాచారం అందించారు. కానిస్టేబుల్ ఉద్యోగం కోసమంటూ వెళ్లిన తమ కొడుకు మృత్యువాత పడటంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. గుండెపోటు కారణంగానే సంజీవ్ మృతి చెందాడని రిమ్స్ డైరెక్టర్ సిద్దప్ప గౌరవ్ తెలియజేశారు.
కృష్ణా జిల్లాలో కారు - లారీ ఢీ
జిల్లాలోని గరికపర్రు చెక్ పోస్టు సమీపంలో జాతీయ రహదారిపైన సోమవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. లారీ, కారు ఢీకోవడంతో వారు మృతి చెందారు. చెక్ పోస్టు వద్ద ఆగి ఉన్న లారీని వెనుక నుండి వచ్చిన కారు ఢీకొంది. మృత్యువాత పడ్డవారు పశ్చిమ గోదావరి జిల్లా వాసులుగా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications