వేదికపై అంజన్ అసంతృప్తి: కవితకి చేదు అనుభవం

కార్యకర్తల సేవలను ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గుర్తించాలని కోరారు. యాదవులకు పదవులు ఇవ్వమని రాష్ట్ర కాంగ్రెసు నేతలు ఒక్కసారైనా పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి చెప్పారా అని అడిగారు. బిసిలి, మైనార్టీలకు కూడా ఉప ప్రణాళిక అమలయ్యేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. అన్ని వర్గాలకు న్యాయం జరిగేలా ఉప ప్రణాళికలు అమలయ్యేలా ముఖ్యమంత్రి చొరవ చూపించాలన్నారు. పార్టీలో నిజమైన కార్యకర్తలకు అన్యాయం జరుగుతోందన్నారు.
దేశంలో 22 కోట్ల మంది యాదవులు ఉన్నారన్నారు. దక్షిణాది నుంచి గెలిచిన ఏకైన యాదవ ఎంపీని తానేనని చెప్పారు. యుపిఏ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి బిసిలకు మంత్రి పదవి రాలేదన్నారు. బిసిలకు ప్రాధాన్యత ఇస్తేనే బాగుంటుందన్నారు. కాంగ్రెసు పార్టీ ద్వారానే అందరికీ న్యాయం జరుగుతుందని కార్మిక శాఖ మంత్రి దానం నాగేందర్ అన్నారు. ప్రజా సంక్షేమ పథకాలు ఇలాగే అమలుపరుస్తూ.. కార్యకర్తలకు ప్రాధాన్యం ఇస్తే వచ్చే సార్వత్రిక ఎన్నికల్లోనూ కాంగ్రెసు పార్టీ తిరుగులేని శక్తిగా ఎదుగుతుందన్నారు.
కవితకు చేదు అనుభవం
అంతకుముందు మహబూబాబాద్ ఎమ్మెల్యే కవితకు చేదు అనుభవం ఎదురయింది. వేదిక వద్ద ఉన్న విఐపిల గ్యాలరీలోకి కవితను అనుమతించలేదు. భద్రతా సిబ్బంది ఆమెను అడ్డుకున్నారు. దీంతో ఆమె సమావేశం ప్రాంగణం బయట బైఠాయించారు.












Click it and Unblock the Notifications