బాబుకు తెలంగాణ సెగ, ఉద్రిక్తత: నచ్చజెప్పిన అధినేత

గో బ్యాక్ చంద్రబాబు, టిడిపి డౌన్ డౌన్, చంద్రబాబు డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. తెలంగాణపై వైఖరి చెప్పాకనే పాదయాత్ర చేయాలని డిమాండ్ చేశారు. వారిని తెలుగు తమ్ముళ్లు అడ్డుకున్నారు. తోపులాట జరిగింది. దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అంతలో చంద్రబాబు కలుగ జేసుకున్నారు. ఇది సరైన వేదిక కాదని, సరైన విధానం కాదని ఆందోళనకారులకు నచ్చజెప్పే ప్రయత్నాలు చేశారు.
తాము అఖిల పక్షంలో స్పష్టమైన వైఖరి చెబుతామని అన్నారు. ఆందోళనకారులు ఎంతకూ తగ్గలేదు. పోలీసులు రంగంలోకి దిగి వారిని అక్కడ నుండి పంపించారు. దీంతో పరిస్థితి సద్దుమణిగింది. ఈ సందర్భంగా బూరుగుపల్లిలో ఏర్పాటు చేసిన సభలో చంద్రబాబు మాట్లాడారు. దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలో రాష్ట్రంలో వ్యవస్థలన్నీ పతనమయ్యాయన్నారు. కాంగ్రెసు పార్టీ పూర్తిగా అవినీతిలో కూరుకు పోయిందన్నారు.
టేబుల్ కింద డబ్బులు పెట్టినా పనులు కావడం లేదని మండిపడ్డారు. తెలంగాణ సమస్య పరిష్కారానికి కాంగ్రెసు పార్టీ సిద్ధపడటం లేదన్నారు. తెలుగుదేశం పార్టీని దెబ్బతీయాలనే ఉద్దేశ్యంతో కాంగ్రెసు, ఇతర పార్టీలు ఉన్నాయన్నారు. త్వరలో యూత్ పాలసీని ప్రకటిస్తామన్నారు.












Click it and Unblock the Notifications