వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఢిల్లీ గ్యాంగ్ రేప్: శాంతిగా ఉండాలని విక్టిం తండ్రి విజ్ఞప్తి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Delhi gangrape victim's father appeals for calm
న్యూఢిల్లీ: నిరసనకారులు శాంతియుతంగా ఉండాలని ఢిల్లీ బస్సు గ్యాంగ్ రేప్ బాధితురాలి తండ్రి ఆదివారం రాత్రి పిలుపునిచ్చారు. రేప్ అంశంపై ఢిల్లీలో వారం రోజులుగా అట్టుకుతోన్న విషయం తెలిసిందే. ఆందోళనకారులు రాష్ట్రపతి భవన్ వైపు చొచ్చుకు వెళ్లే ప్రయత్నాలు చేయడం, పోలీసులు వారిపై లాఠీఛార్జ్ చేయడం, వాటర్ క్యానన్లు, బాష్పవాయు గోళాలు ప్రయోగిస్తుండటం తెలిసిందే. ఆదివారం కూడా ఢిల్లీలో ఉద్రిక్త పరిస్థితిలు ఏర్పడ్డాయి. సోమవారం కూడా ఆందోళనకారులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు.

ఈ నేపథ్యంలో ఆదివారం రాత్రి గ్యాంగ్ రేప్ బాధితురాలి తండ్రి శాంతియుతంగా నిరసన తెలపాలని సూచించారు. విధ్వంసాన్ని ఆపాలని విజ్ఞప్తి చేశారు. నిందితులకు సాధ్యమైనంత త్వరగా శిక్ష పడేందుకు పోలీసులకు సహకరించాలని ఆయన కోరారు. అలాగే తన 23 ఏళ్ల కూతురు కోసం దేవుడిని ప్రార్థించాలని ఆయన ఆందోళనకారులకు విజ్ఞప్తి చేశారు. తన కూతురు ఆరోగ్య పరిస్థితి ఇప్పుడు బాగానే ఉందని చెప్పారు.

కాగా వారం రోజుల క్రితం జరిగిన గ్యాంగ్ రేప్ ఘటన వేడి దేశ రాజధానిలో ఇంకా చల్లారలేదు. పెద్ద ఎత్తున ఆందోళనకారులు ఆదివారం ఇండియా గేట్ వద్దకు తరలి వచ్చారు. నిందితులను వెంటనే కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు. ఆందోళనకారులు రాష్ట్రపతి భవన్ వైపు వెళ్లేందుకు ప్రయత్నాలు చేశారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకునే ప్రయత్నాలు చేశారు. పోలీసులు, ఆందోళనకారుల మధ్య తోపులాట జరిగింది.

ఆందోళనకారులు పోలీసులపై రాళ్లు రువ్వారు. పోలీసులు వాటర్ క్యానన్‌లు, బాష్పవాయువును ప్రయోగించారు. లాఠీఛార్జ్ చేసి ఆందోళనకారులను చెదరగొట్టారు. ఆందోళనకారులపై లాఠీఛార్జ్‌ని నిరసిస్తూ జంతర్ మంతర్ వద్ద మరికొంతమంది ఆందోళన చేపట్టారు. పోలీసులు వారిని కూడా అక్కడి నుండి చెదరగొట్టారు. ఢిల్లీలో పోలీసులు నిషేధాజ్ఞలు విధించారు. ఆందోళనకారులకు బాబా రామ్ దేవ్ మద్దతు పలికారు.

English summary
An emotional father of the Delhi gangrape victim on Sunday night appealed to the protesters to stop vandalism and help police in bringing the culprits to justice at the earliest. He also appealed to the people to pray for his 23-year-old daughter, who is fighting for her life at a city hospital.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X