భారత్ అంటే అపనమ్మకమే కానీ: పాకిస్తానీ ప్రశంసలు

Pakistan
ఇస్లామాబాద్/హైదరాబాద్: భారత దేశంపై, భారత ప్రజల పైన ఓ పాకిస్తానీ ప్రశంసల వర్షం కురిపించారు. అద్నన్ అదీల్ మెమన్ అనే పాకిస్తానీ కరాచీలో ఇంజనీర్‌గా పని చేస్తున్నారు. ఆయన కుమార్తెకు చెవుడు. ఆమెకు హైదరాబాదులోని అపోలో ఆసుపత్రిలో కాక్లియర్ ఇంప్లాంట్ చికిత్స చేయడంతో ఇప్పుడు వినగల్గుతోంది. మాట్లాడగల్గుతోంది. దీంతో అద్నన్ భారత్‌కు, తనకు సహకరించిన రెండు స్వచ్చంధ సంస్థలకు కృతజ్ఞతలు తెలుపుతూ లేఖ రాశారు. రెండేళ్ల తన కుమార్తె ఆరోగ్య పరిస్థితి మెరుగుపడుతోందని, చికిత్స జరగకుంటే ఇది జరిగి ఉండేది కాదని ఆయన లేఖలో పేర్కొన్నారు.

భారత్‌లో సాహి అనే సంస్థ తనకు, తన కుటుంబానికి ఇచ్చిన గొప్ప బహుమతి ఇచ్చిందని, తాను, తన స్నేహితులు, తన దేశం వారు భారత్ సహాయం కోరుకోవాలని కలలో కూడా కోరుకోమని, స్వాతంత్రం వచ్చినప్పటి నుండి ఆ దేశమంటే తమకు అపనమ్మకమేనని ఆయన అందులో అభిప్రాయపడ్డారు. కానీ ఇప్పుడు హైదరాబాదులో ఆ సంస్థ చూపిన ఆదరణ అపూర్వం అని, జీవితంలో ఎన్నడూ మర్చిపోలేమన్నారు.

సాహితో పాటు కోవా స్వచ్ఛంద సంస్థకు కూడా ఆయన కృతజ్ఞతలు తెలుపుతూ లేఖ రాశారు. సాహి సంస్థ తమ కూతురు శస్త్ర చికిత్స కోసం ఆర్థికంగా ఆదుకున్నాయని పేర్కొన్నారు. సాహి స్పందన చూసిన వెంటనే మేం అనుమానించామని, భారత్‌లో అడుగు పెట్టిన వెంటనే మా డబ్బంతా లాగేసుకోవడానికి ఎవరో మోసగాళ్లు ఎత్తు వేశారని అనుకున్నామని, పాకిస్థాన్‌లాగే పేదరికంలో మగ్గుతున్న భారత్‌లోని స్వచ్ఛంద సంస్థ శత్రు దేశంలోని చిన్నారికి ఎందుకు సహకరిస్తుందని అనుమానించామన్నారు.

కానీ, సాహికి చెందిన కృష్ణమూర్తి రావుతో మాట్లాడిన తర్వాత తనకు విశ్వాసం కలిగిందని రాశారు. సాహి బృందం, డాక్టర్లు వినయ్ కుమార్, సునీతా రెడ్డి, పి.కృష్ణమూర్తి రావు, కోవా ఫౌండేషన్‌కు చెందిన మజీర్ హుస్సేన్ ఎంతో ప్రోత్సహించారన్నారు. కోవా ఆధ్వర్యంలో జరిగిన సంయుక్త స్వాతంత్య్ర దినోత్సవాల్లో ముఖ్య అతిథులుగా పాల్గొనే అరుదైన గౌరవమూ మాకు దక్కింది. రంజాన్ పర్వదినం రోజు మేం అక్కడి అపోలో ఆస్పత్రిలోనే ఉన్నామని చెప్పారు.

డాక్టర్ వినయ్ కుమార్, డాక్టర్ సునీతా రెడ్డిలు తమ ఇంట్లో చేసిన అద్భుతమైన వంటకాలనే మాకు కూడా తెచ్చి ఇచ్చారని, మజీర్ హుస్సేన్ స్వీట్లు, భోజనం పెట్టారని, తమ కుటుంబంలో ఒకరిగా మమ్మల్ని భావించారని గుర్తు చేసుకున్నారు. వారు అంత ప్రేమ చూపించడం మా అదృష్టమా? మేం పాకిస్థాన్ నుంచి వచ్చినందుకా? లేక వారంతా గొప్ప సంస్కారులా!? ఈ మూడూ నిజమేనని తనకు అనిపించిందని అభిప్రాయపడ్డారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+