మీటింగ్‌లో పేరుతో ఎన్నిసార్లు రారు: ఎల్వీపై కోర్టు ఫైర్

LV Subrahmanyam
హైదరాబాద్: మంత్రి ధర్మాన ప్రసాద రావు గురువారం ఉదయం సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సిబిఐ) కోర్టుకు హాజరయ్యారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆస్తుల కేసుకు సంబంధించిన వాన్ పిక్ కేసులో ధర్మాన నిందితుడు. ఈ కేసులో ధర్మానతో పాటు మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ కూడా నిందితుడు. అతను ఇప్పటికే చంచల్ గూడ జైలులో ఉన్నారు.

ఈ కేసులో మంత్రి ధర్మాన ప్రసాద రావును, మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణలను ప్రశ్నించేందుకు తమకు ప్రభుత్వం అనుమతి అవసరం లేదని ఈ నెల 17వ తేదిన సిబిఐ కోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. కేసుకు సంబంధించి వాదనలు ప్రారంభమయ్యాయి. పిసి యాక్ట్ కింద అభియోగాల నేపథ్యంలరో ధర్మానపై విచారణ మొదలైంది. మోపిదేవి, బ్రహ్మానంద రెడ్డిల పైన కూడా విచారణ మొదలవనుంది. ఆస్తుల కేసుకు సంబంధించి జగన్ రిమాండును కోర్టు ఫిబ్రవరి 14 వరకు పొడిగించింది.

ఎల్వీ సుబ్రహ్మణ్యంపై సిబిఐ కోర్టు ఆగ్రహం

ఎమ్మార్ కేసులో నిందితుడు ఐఏస్ అధికారి ఎల్వీ సుబ్రహ్మణ్యంపై సిబిఐ కోర్టు గురువారం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎల్వీ కోర్టుకు హాజరు కాకపోవడంపై న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎల్వీ ప్రస్తుతం తిరుమల తిరుపతి దేవస్థానం ఈవోగా ఉన్నారు. సమావేశాల కారణంగా ఎల్పీ కోర్టుకు హాజరు కాలేదని ఆయన తరఫు న్యాయవాదులు కోర్టుకు తెలియజేశారు. దీంతో సమావేశాల పేరుతో ఎన్నిసార్లు కోర్టుకు హాజరుకారని ప్రశ్నించింది.

ఇప్పటి వరకు ఎన్ని సమావేశాలకు హాజరయ్యారో చెప్పాలని అడిగింది. ఎప్పుడెప్పుడు ఏయే సమావేశాలకు హాజరయ్యారో పూర్తి వివరాలు ఇవ్వాని ఆదేశించింది. తదుపరి విచారణకు తమ క్లయింట్ హాజరవుతారని ఎల్వీ సుబ్రహ్మణ్యం తరఫు లాయర్లు కోర్టుకు విన్నవించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+