కాళేశ్వర్ బాబా ఫ్యామిలీలో బయటపడ్డ విభేదాలు

Kaleshwar Baba
అనంతపురం: తమకు కాళేశ్వర్ బాబా ట్రస్టు సభ్యుల నుండి ప్రాణ హానీ ఉందని కాళేశ్వర్ బాబా తల్లిదండ్రులు ఆదివారం ఆరోపించారు. గత ఏడాది కాళేస్వర్ బాబా మృతి చెందిన విషయం తెలిసిందే. బాబు ప్రథమ వర్ధంతి సందర్భంగా కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు మరోసారి బయటపడ్డాయి. కాళేశ్వర బాబాకు చెందిన 50 కిలోల బంగారం, కోట్లాది రూపాయల విలువైన ఆస్తికి సంబంధించిన పత్రాలను బాబా భార్య, ట్రస్టు సభ్యులు మాయం చేశారని తండ్రి సుబ్బరాయుడు ఆరోపించారు. వారి నుండి ప్రాణ హానీ ఉందన్నారు.

కాగా గతేడాది కాళేశ్వర్ బాబా మృతి చెందిన తర్వాత కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు పొడసూపాయి. ఆశ్రమంలో కోట్లాది రూపాయల విలువచేసే ఆభరణాలు మాయమైనట్లు గతంలోనే వార్తలు వచ్చాయి. అనంతపురం జిల్లా పెనుకొండలోని కాళేశ్వర్ బాబా ఆశ్రమంలో గల బీరువాలు ఖాళీగా దర్శనమివ్వడంపై కాళేశ్వర్ తండ్రి సుబ్బరాయుడు తీవ్ర మనస్తాపానికి గురైనట్లుగా వార్తలు వచ్చాయి.

కాళేశ్వర్ ఆశ్రమంలోని గదులను ఈనెల 5న తెరిచారని, అందులోని బీరువాలను కాళేశ్వర్ భార్య శిల్పతో తెరిపించారని అన్నారు. ఆ బీరువాల్లో ఆభరణాలు మాయం కావడం షాక్‌కు గురిచేసిందని చెప్పినట్లుగా వార్తలు వచ్చాయి. బాబాను గతనెల 14న ఆస్పత్రిలో చేర్చగానే ఆయన గదులకు తాళం వేశారని, కలెక్టర్‌కు విన్నవించుకోవడంతో ఆర్డీవో ద్వారా 11 మంది సభ్యులు లోనికి వెళ్లి ఈ నెల 5న గదుల తాళం తీసి బీరువాలు తెరచి చూశారని చెప్పినట్లుగా అప్పట్లో వార్తలు వచ్చాయి.

బీరువాల్లో బాబా ఆభరణాలు ఏమీ లేవని, కోట్ల రూపాయల ఆభరణాలు కనిపించకుండా పోయాయని వారు అప్పుడు చెప్పారు.ఆరు అడుగుల ఆంజనేయస్వామి విగ్రహానికి 5 కేజీల బంగారు కిరీటం, గద, కవచం.. ఇవేవీ లేవని, షిరిడీ సాయి విగ్రహానికి చెందిన హారం, వెండి ఆభరణాలు కూడా లేవన్నారు. కాళేళ్వర్ చేతికి ఉండాల్సిన ఉంగరాలు, ఆయనకున్న రెండు బంగారం బెల్టులలో ఒక బెల్ట్, బ్రాస్‌లెట్లు కూడా కనిపించడం లేదని వారు వివరించినట్లుగా వచ్చింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+