ఈ ఏడాదే ఎన్నికలు రావచ్చు, సిద్ధం కండి: కెసిఆర్

ఎమ్మెల్సీ ఎన్నికల పర్యవేక్షణకు ప్రతి జిల్లాకు ఒక సీనియర్ నేతను నియమించనున్నట్లు ఆయన తెలిపారు. మార్చి 2వ తేదీన తలపెట్టిన విజయవాడ రహదారి దిగ్బంధం కార్యక్రమాన్ని తెలంగాణ జెఎసితో మాట్లాడి వాయిదా వేయిద్దామని ఆయన చెప్పారు. ఫిబ్రవరి 24వ తేదీన జరిగే బెంగళూర్ రహదారి దిగ్బంధంలో పాలమూరు జిల్లా నేతలు, కార్యకర్తలు చురుగ్గా పాల్గొనాలని ఆయన సూచించారు.
ఏప్రిల్‌లో తెలంగాణ జిల్లాల్లో కెసిఆర్ బస్సు యాత్ర చేపట్టే అవకాశాలున్నాయి. తెరాస కార్యవర్గ సమావేశంలో మూడు తీర్మానాలు చేశారు. హైదరాబాదు నగరంలోని చారిత్రక ప్రదేశాలకు ఆటంకం లేకుండా మెట్రో రైలు మార్గాన్ని అండర్ గ్రౌండ్ ద్వారా నిర్మించాలని తెరాస ప్రభుత్వానికి సూచించింది. రాయితీ గ్యాస్ సిలిండర్ల సంఖ్యను 12కు పెంచాలని, విద్యాత్ చార్జీల పెంపు ప్రతిపాదనను ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని కోరింది.
సహకార సంఘాల ఎన్నికలు మంత్రులు, అధికార పార్టీ శాసనసభ్యుల కనుసన్నల్లో జరిగాయని, కాంగ్రెసు గోల్‌మాల్ చేసి ఈ ఎన్నికల్లో గెలిచిందని నాయని నర్సింహారెడ్డి విమర్సించారు. తెరాస కార్యవర్గ సమావేశంలో మెదక్ పార్లమెంటు సభ్యురాలు విజయశాంతి కూడా పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications