జగన్ సిఎం అవుతారనే ప్రతాపం చూపిస్తున్నారు: షర్మిల

జగన్ ముఖ్యమంత్రి అవుతాడన్న భయంతో కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు కుమ్మక్కై ప్రతాపం చూపుతున్నాయన్నారు. చంద్రబాబు ఎమ్మార్ భూముల్లో వేలాది ఎకరాలు ఆక్రమించుకున్నా సిబిఐ పట్టించుకోలేదన్నారు. పేద, బడుగు, బలహీన వర్గాలు, మహిళలకు దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలో ప్రవేశపెట్టిన పథకాలను అమలు చేయడం లేదన్నారు. ప్రభుత్వం ధరలు పెంచి సామాన్యుల రక్తం తాగుతోందన్నారు.
ఎమ్మార్‌కు వందల ఎకరాలు అప్పనంగా చంద్రబాబు కట్టబెట్టారని, ఐఎంజి అనే తన బినామీ సంస్థకు 850 ఎకరాలను తక్కువ ధరకు దోచి పెట్టాడని మండిపడ్డారు. ఆయన అవినీతిపై కమ్యూనిస్టులైతే ఓ పుస్తకమే రాశారన్నారు. అయినా ఆయనపై కాంగ్రెసు ప్రభుత్వం విచారణ జరిపించదన్నారు. చంద్రబాబు కేంద్రమంత్రి చిదంబరాన్ని చీకట్లో కలిసి మేనేజ్ చేసుకున్నారని, అందుకే ఆయనపై కేసులు లేవని ఆరోపించారు.
తనపై దర్యాఫ్తు జరపనందుకు చంద్రబాబు రాష్ట్రంలో కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టడం లేదని విమర్శించారు. ప్రజలు కష్టాలు పడుతున్నా, కిరణ్, చంద్రబాబులకు పట్టదన్నారు. బాబు ఖజానా మొత్తం అవినీతి ఖజానా అన్నారు. కాంగ్రెసు, టిడిపిలు అన్నింటా కుమ్మక్కయ్యాయన్నారు. తన సోదరుడు కాంగ్రెసుతో విభేదించాడు కాబట్టే కేసులు, జైలు అన్నారు.












Click it and Unblock the Notifications