ప్రియుడితో కలిసి భర్త హత్య: ఫ్యాక్షన్‌కు ముగ్గురు బలి

నెల్లూరు జిల్లాలో ముగ్గురు బలి
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ఫ్యాక్షన్ గొడవలు భగ్గుమన్నాయి. జిల్లాలోని దుత్తలూరు మండలం సోమలరేగడ గ్రామంలో పాత కక్షల నేపథ్యంలో ఓ కుటుంబంపై ప్రత్యర్థులు కత్తులతో దాడి చేశారు. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందారు. ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. వారిని నెల్లూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతి చెందిన వారిలో రమాదేవి, ఝాన్సీలు ఉన్నారు. తల్లీకూతురు అక్కడికక్కడే మృతి చెందారు.
రాధాకృష్ణ రెడ్డి, వెంకట సుబ్బారెడ్డి, సోమశేఖర రెడ్డిలు తీవ్రంగా గాయపడ్డారు. వారిని ఆసుపత్రికి తరలించారు. వీరంతా ఒకే కుటుంబానికి చెందిన వారు. ఇటీవల జరిగనన నందిపాడు సహకార ఎన్నికలలో తలెత్తిన వివాదాలే ఈ హత్యలకు కారణంగా అనుమానిస్తున్నారు.
అన్నంలో విషం కలిపిన అత్త
గుంటూరు జిల్లాలోని పివిపాలెం మండలం గౌడపాలెంలో కుటుంబ తగాదాల నేపథ్యంలో ఓ అత్త దారుణానికి పాల్పడింది. విషం కలిపిన అన్నాన్ని కోడలు, మనువడికి పెట్టింది. అది తిన్న మనువడు మృతి చెందగా, కోడలు పరిస్థితి విషమంగా ఉంది. కోడలిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.












Click it and Unblock the Notifications