65వ బర్త్ డే: జయలలిత ఆగ్రహం-అనుగ్రహం(ఫోటోలు)

చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి, అన్నాడిఎంకె అధినేత్రి జయలలిత 65వ పుట్టిన రోజు సందర్భంగా ఆ పార్టీ చెన్నైలో 65 జంటలకు పెళ్లిళ్లు చేసింది. ఈ కార్యక్రమానికి జయలలిత హాజరై 65 జంటలను ఆశీర్వదించారు. ఇదే వేడుకలో మాట్లాడిన జయలలిత జాతీయ పార్టీలు అయిన కాంగ్రెసు, భారతీయ జనతా పార్టీ పైన మండిపడ్డారు.

కావేరీ నీటి విషయంలో బిజెపి, కాంగ్రెసులు తప్పుడు ఆరోపణలు చేస్తున్నాయని విమర్శించారు. ఆ రెండు పార్టీలు ఎన్ని ప్రయత్నాలు చేసినా తమిళనాడులో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేవన్నారు. కర్నాటకలో ఆ రెండు పార్టీలకు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాలు రావొచ్చు.

కానీ, తమిళనాడులో అలాంటి అవకాశం లేదన్నారు. అందుకే, కావేరీ నీటి విషయంలో తమిళనాడుకు నష్టం జరిగేలా కర్నాటక వైపు మాట్లాడుతున్నారని ఆరోపించారు. అధికార కాంగ్రెసు పార్టీ బిజెపికి అవకాశమిస్తోందన్నారు. కాంగ్రెసు, బిజెపిలు ఎన్ని ప్రయత్నాలు, ప్రార్థనలు చేసినా తమిళనాడు వారికి దక్కదని అభిప్రాయపడ్డారు.

వచ్చే ఎన్నికల్లో తమిళనాడులో తమ పార్టీ 40 పార్లమెంటు సీట్లు గెలుచుకోవాలన్నారు. అప్పుడే కేంద్రం తమ మాటను వింటుందన్నారు. ఆ దిశలో తమ పార్టీ క్షేత్ర స్థాయిలో ఇప్పటికే సిద్ధమవుతోందన్నారు. జాతీయస్థాయిలో కూడా ఆ రెండు పార్టీలకు తమిళనాడు పార్టీల అండ కావాల్సిందే అన్నారు.

జయలలిత ఆగ్రహం-అనుగ్రహం(ఫోటోలు)

ఓ జంటను ఆశీర్వదిస్తున్న జయలలిత.

జయలలిత ఆగ్రహం-అనుగ్రహం(ఫోటోలు)

వేదిక పైనుండి మాట్లాడుతున్న జయ, పక్కన పెళ్లైన జంటలు.

జయలలిత ఆగ్రహం-అనుగ్రహం(ఫోటోలు)

పెళ్లైన జంటలతో జయలలిత.

జయలలిత ఆగ్రహం-అనుగ్రహం(ఫోటోలు)

కత్తి బహూకరిస్తున్న ఓ అభిమాని.

జయలలిత ఆగ్రహం-అనుగ్రహం(ఫోటోలు)

మాట్లాడుతున్న జయలలిత.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+