కిరణ్ రెడ్డిపై మరోసారి డిఎల్ ఫైర్: బాబుపై మారెప్ప

కాంగ్రెస్ పార్టీలో కష్టపడి పనిచేసే వారికి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అనుగ్రహం దక్కడం లేదని ఆయన విమర్శించారు. ప్రజలకు చౌక దుకాణాల ద్వారా సరఫరా చేస్తున్న నిత్యావసరాల ప్యాకెట్లపై ముఖ్యమంత్రి, ఇతర మంత్రుల ఫొటోలు ఉండడం సిగ్గుచేటని రవీంద్రారెడ్డి వ్యాఖ్యానించారు. కడప జిల్లాకు ఎమ్మెల్సీ స్థానం లభించేది అనుమానమేనని డిఎల్ రవీంద్రా రెడ్డి అన్నారు.
ఇదిలావుంటే, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకుడు, మాజీ మంత్రి మారెప్ప తీవ్రంగా విరుచుకుపడ్డారు. చంద్రబాబు అధికారంలోకి రావడం కల్ల అని ఆయన శనివారం మీడియాతో అన్నారు.
అధికారంలోకి రావడానికి తప్ప ప్రజల కోసం చంద్రబాబు ఏం చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. 2004, 2009 ఎన్నికల్లో చంద్రబాబుకు ప్రజలు బుద్ధి చెప్పారని ఆయన అన్నారు. మళ్లీ 2014 ఎన్నికల్లో చంద్రబాబుకు ప్రజలు బుద్ధి చెప్తారని ఆయన అన్నారు. పాదయాత్రకు అర్థం చెప్పిన మహావ్యక్తి వైయస్ రాజశేఖర రెడ్డి అని ఆయన అన్నారు. కోట్ల మంది వైయస్ రాజశేఖర రెడ్డిని దేవుడిగా పూజిస్తారని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications