హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఫొటోలు: చిరు ప్రజారాజ్యం లాగే వైయస్ జగన్ పార్టీ

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ మాదిరిగానే వైయస్ జగన్ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కనిపిస్తోంది. పార్టీ వెనక కొంత మంది నాయకులు ముఖ్య పాత్ర పోషించడం, ప్రజల ముందు మరి కొంత మంది కనిపించడం సాధారణ లక్షణంగా కనిపిస్తోంది. ప్రజారాజ్యం పార్టీ తెర వెనక మిత్రా, పరకాల ప్రభాకర్ వంటి నాయకులు కీలక పాత్ర పోషించారు. ప్రజల ముందుకు చిరంజీవి కుటుంబ సభ్యులు పవన్ కళ్యాణ్, నాగబాబు, అల్లు అరువింద్ వంటివారు కనిపించారు. ప్రజల్లో ఉన్న ఆదరణతో పార్టీ విజయం సాధిస్తామని ప్రజారాజ్యం పార్టీ నాయకులు నమ్మారు.

ప్రస్తుతం జగన్ వైయస్సార్ కాంగ్రెసు పార్టీలోనూ అదే పరిస్థితి కనిపిస్తోంది. తెర వెనక సుబ్బారెడ్డి వంటి నాయకులు కీలక భూమిక పోషిస్తున్నారు. తెర ముందు వైయస్ జగన్ కుటుంబ సభ్యులు వైయస్ విజయమ్మ, షర్మిల కనిపిస్తున్నారు. ప్రజాదరణ మెండుగా ఉందని, వైయస్ రాజశేఖర రెడ్డిపై ప్రజల్లో ఉన్న ప్రేమాభిమానాలు తమను గెలిపిస్తాయని వైయస్సార్ కాంగ్రెసు నాయకులు భావిస్తున్నారు.

ఇతర పార్టీల్లోంచి వచ్చిన నాయకులను, తాజా మాజీ ఎమ్మెల్యేలను చిరంజీవి పార్టీలో చేర్చుకుంటూ వచ్చారు. వలసలు విపరీతంగానే సాగాయి. కానీ, పార్టీ నిర్మాణాన్ని కింది స్థాయిలో నిర్మించడాన్ని పట్టించుకోలేదు. కార్యకర్తల వ్యవస్థను సంఘటిత పరచలేదు. పార్టీకి కింది స్థాయి నుంచి నిర్మాణం లేకుండా పోయింది. నిజానికి, పార్టీకి వ్యవస్థీకృత నిర్మాణమే లేదు. ఇప్పుడు జగన్ పార్టీ పరిస్థితి కూడా అదే. ఇతర పార్టీల నుంచి వస్తున్న వారిని చేర్చుకోవడంలో జగన్ నిమగ్నమై ఉన్నట్లు కనిపిస్తున్నారు. దాంతో పార్టీకి ఎప్పటికప్పుడు ఊపునిచ్చే పని చేస్తున్నారు.

కీలకమైన విషయాలపై చిరంజీవి అప్పుడు కచ్చితమైన నిర్ణయాలు తీసుకోలేదు. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణను దాటేశారు. తెలంగాణ అంశం విషయంలో సామాజిక తెలంగాణ పేరుతో మడతపెచీ పెట్టారు. వైయస్ జగన్ కూడా అలాంటి విధానాన్నే అనుసరిస్తున్నారు. తెలంగాణకు వ్యతిరేకం కాదని మాత్రమే వైయస్ జగన్ పార్టీ చెబుతోంది. ఎస్సీ వర్గీకరణపై తేల్చలేదు. ప్రజలకు మేలు చేస్తామనే ఓ అనిర్దిష్ట నినాదంతో చిరంజీవి ప్రజల్లోకి వెళ్లారు. తన తండ్రి వైయస్ రాజశేఖర రెడ్డి సంక్షేమ పథకాల పేర్లతో జగన్ ప్రజల్లోకి వెళ్లారు. ఆయన జైలులో ఉండడంతో ఆయన సోదరి షర్మిల, తల్లి విజయమ్మ అదే పని చేస్తున్నారు.

ఫొటోలు: చిరు పార్టీలాగే జగన్ పార్టీ

చిరంజీవి తన ప్రజారాజ్యం పార్టీని తిరుపతిలో ఘనంగా ప్రారంభించారు. రెండు చేతులు బార్లా చాపి ప్రజలకు విశ్వాసాన్ని కల్పించే ప్రయత్నం చేశారు.

ఫొటోలు: చిరు పార్టీలాగే జగన్ పార్టీ

వైయస్ జగన్ కాంగ్రెసు పార్టీకి రాజీనామా చేసి, అదే ఊపులో చిరంజీవి మాదిరిగానే తన సొంత పార్టీ వైయస్సార్ కాంగ్రెసు పార్టీని స్థాపించారు.

ఫొటోలు: చిరు పార్టీలాగే జగన్ పార్టీ

తన పార్టీని అధికారంలోకి తెచ్చి, తాను ముఖ్యమంత్రి కావడానికి చిరంజీవి ప్రజల్లో విస్తృతంగా పర్యటించారు. ప్రజలు ఆయనను చూడడానికి వీధుల మీదికి పెద్ద యెత్తున వచ్చారు.

ఫొటోలు: చిరు పార్టీలాగే జగన్ పార్టీ

వైయస్ జగన్ ఓదార్పు యాత్ర, తదితర కార్యక్రమాల ద్వారా ప్రజల్లోకి విస్తృతంగా వెళ్లారు. ఆయనకు యువకులు, ప్రజలు బ్రహ్మరథం పట్టినట్లే కనిపించారు.

ఫొటోలు: చిరు పార్టీలాగే జగన్ పార్టీ

తమ్ముడు పవన్ కళ్యాణ్ అన్నయ్య చిరంజీవిని ముఖ్యమంత్రి పీఠంపై చూడడానికి చెమటోడ్చారు. ప్రజల్లోకి తన ఇమేజ్‌ను చాటుకున్నారు.

ఫొటోలు: చిరు పార్టీలాగే జగన్ పార్టీ

ప్రజలకు తాను అత్మబంధువుని అని, తాను ప్రజలను సమస్యల నుంచి బయటపడేస్తానని చెప్పడానికి చిరంజీవి ప్రజలకు అత్యంత సన్నిహితంగా మెలిగాడు.

ఫొటోలు: చిరు పార్టీలాగే జగన్ పార్టీ

బావమరిది అల్లు అరవింద్ చిరంజీవిని వెనక నుంచి నడిపే చోదక శక్తిగా పనిచేశారు. అల్లు అరవింద్ చిరంజీవి రాజకీయంలో కీలక పాత్ర పోషించారు.

ఫొటోలు: చిరు పార్టీలాగే జగన్ పార్టీ

చిరంజీవి రాజకీయ రైలు బండిని ముందుకు నడిపించడానికి అల్లు అర్జున్, రామ్ చరణ్ తేజ్ కూడా ఓ చేయి వేశారు.

ఫొటోలు: చిరు పార్టీలాగే జగన్ పార్టీ

రాజకీయ కార్యక్రమాలను చిరంజీవి సినిమా షూటింగుల మాదిరిగా చేశారనే వ్యాఖ్య ఉంది. రాజకీయాలకు గ్లామర్‌ను తేవడానికి ఆయన పెద్ద చేయే వేశారు.

ఫొటోలు: చిరు పార్టీలాగే జగన్ పార్టీ

ప్రజలకు తానే నాయక్ అని చాటుకోవడానికి వైయస్ జగన్ తీవ్రంగానే ప్రయత్నించారు. తనదైన రీతిలో ప్రజలకు అభివాదం చేస్తూ వారిని ఆకర్షించే ప్రయత్నం చేశారు.

ఫొటోలు: చిరు పార్టీలాగే జగన్ పార్టీ

అవినీతి ఆరోపణలపై జగన్ జైలుకు వెళ్లడానికి ముందే పార్టీ కోసం తన తల్లి వైయస్ విజయమ్మను రాజకీయాలకు సిద్ధం చేశారు జగన్.

ఫొటోలు: చిరు పార్టీలాగే జగన్ పార్టీ

వైయస్ జగన్ జైలుకు వెళ్లిన తర్వాత వైయస్సార్ కాంగ్రెసు పార్టీ దిక్కులేని పక్షి అవుతుందని అనుకున్నారు. జైలు నుంచే ఆయన రాజకీయాలు నడుపుతున్నారని అంటున్నారు. ఎన్నికల లోపు జగన్ జైలు నుంచి బయటకు వస్తారని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు ఆశతో ఉన్నారు.

ఫొటోలు: చిరు పార్టీలాగే జగన్ పార్టీ

వైయస్ రాజశేఖర రెడ్డి నీడలో జీవితాన్ని గడుపుతూ వచ్చిన వైయస్ విజయమ్మ కుమారుడు జైలు పాలు కావడంతో ప్రజల్లోకి వచ్చారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీని నిలబెట్టడానికి ప్రయత్నిస్తున్నారు.

ఫొటోలు: చిరు పార్టీలాగే జగన్ పార్టీ

వైయస్ జగన్ సతీమణి భారతి సంస్థల వ్యవహారాలు చూసుకుంటూ అప్పుడప్పుడు ఇలా రాజకీయాల్లో కూడా కనిపిస్తున్నారు.

ఫొటోలు: చిరు పార్టీలాగే జగన్ పార్టీ

జగన్ జైలు పాలై ప్రజల వద్దకు వెళ్లలేని స్థితిలో ఆయన వదిలి బాణంగా షర్మిల పాదయాత్రతో ప్రజల్లోకి వెళ్తున్నారు. ప్రజలకు అతి సన్నిహితంగా వెళ్తూ వారిలో తాను ఒక్కదాన్నని చాటుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.

ఎన్నికలకు ముందు ప్రజల్లోకి విస్తృతంగా వెళ్లడానికి చిరంజీవి ప్రయత్నాలు చేశారు, వెళ్లారు కూడా. చిరంజీవి సభలకు విశేషంగా జనాలు వచ్చారు. కానీ 17 సీట్లు మాత్రమే గెలుచుకున్నారు. వైయస్ జగన్ ఓదార్పు యాత్రలకు ప్రజలు పెద్ద యెత్తున తరలి వచ్చారు. ఉప ఎన్నికల్లో ఆయన 17 శానససభా స్థానాలను గెలుచుకున్నారు. 2009లో తాను ముఖ్యమంత్రి కావడం ఖాయమని చిరంజీవి గట్టిగా నమ్మారు. ఆయన అనుయాయులు కూడా అదే నమ్మకం వ్యవహరించారు. ఇప్పుడు 2014 ఎన్నికల్లో విజయం సాధించి తాను ముఖ్యమంత్రి అవుతానని జగన్ విశ్వసిస్తున్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు కూడా గట్టి నమ్మకంతోనే ఉన్నారు.

చిరంజీవి నమ్మకం వమ్ము కావడంతో ఆయన కొంత కాలం పార్టీని నడిపించి ఆ తర్వాత కాంగ్రెసులో విలీనం చేశారు. ఇప్పుడు కాంగ్రెసులో కేంద్ర పర్యాటక మంత్రిగా దేశవిదేశాలు తిరుగుతున్నారు. జగన్ జైలులో ఉన్నారు. అయితే, 2014 ఎన్నికల తర్వాతనో, అంతకు ముందుగానో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కూడా కాంగ్రెసులో కలుస్తుందని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అంటున్నారు. జగన్ కదలికలు కూడా యుపిఎకు అనుకూలంగా ఉన్నాయి.

English summary
There are more similarities between Chiranjeevi's earstwhile Prajarajyam and YS Jagan's present YSR Congress.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X