వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నా కూతురే సేఫ్ ఫీల్ కావడం లేదు: షీలా దీక్షిత్

By Pratap
|
Google Oneindia TeluguNews

Sheila Dikshit
న్యూఢిల్లీ: నగరంలో తన కూతురే అభద్రతా భావానికి గురవుతోందని ఢిల్లీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ అన్నారు. దేశ రాజధాని ఢిల్లీలో మహిళల భద్రతపై ఆమె తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ ఆ వ్యాఖ్యలు చేశారు. మహిళలపై జరుగుతున్న నేరాల గణాంకాలు దిగ్భ్రాంతికి గురి చేస్తున్నాయని, ఈ సవాల్‌ను ధైర్యంతో, స్థిరనిశ్చయంతో ఎదుర్కోవాల్సి ఉంటుందని ఆమె అన్నారు.

మహిళలపై నేరాలు దేశవ్యాప్తంగా జరుగుతున్నాయని, ఇది పోటీ కాదని, తాను ఆ వివరాల్లోకి వెళ్లదలుచుకోలేదనిన ఆమె అన్నారు. ఓ టీవీ చానెల్ ప్రతినిధితో ఆమె ఆ విధంగా అన్నారు. వీధిలో అమ్మాయిలు నడిచి వెళ్తుంటే ఎవరు మాత్రం ఎందుకు వేధించాలని ఆమె అన్నారు. పాఠశాలకో లేదో కాలేజీకో వెళ్తే ఈలలు మాత్రమే వినిపించేవని అన్నారు.

ఢిల్లీలో శాంతిభద్రతల పరిస్థితి పట్ల ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. ఢిల్లీలోని మహిళల్లో నెలకొన్న అభద్రతా భావాన్ని తొలగించడానికి చాలా చేయాల్సి ఉందని అన్నారు. శాంతిభద్రతల పరిస్థితిపై తాను సంతృప్తిగా లేనని అన్నారు. డిసెంబర్ 16వ తేదీ తర్వాత పరిస్థితి మెరుగు పడిందో లేదో అంచనా వేయలేకపోతున్నానని షీలా దీక్షిత్ అన్నారు.

గట్టి పోలీసు భద్రతను కోరుతూ జోక్యం చేసుకోవాలని తాను ప్రధాని మన్మోహన్ సింగ్‌కు రాసిన లేఖకు స్పందన లేదని, పోలీసు భద్రత అనేది మంత్రదండం కాదు కదా అని ఆమె అన్నారు. ప్రభుత్వంపై అన్ని మోపలేమని, తమ ప్రభుత్వం చేతిలో లేనప్పటికీ తాను శాంతిభద్రతల గురించి పట్టించుకుంటున్నానని ఆమె అన్నారు.

English summary
"My own daughter feels unsafe in the city." This is what Delhi chief minister Sheila Dikshit, a vocal critic of city police, has to say about the law and order situation, especially on safety of women in the capital.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X