వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ధిక్కారమున్ సైతునా: ఎల్వీపై మంత్రి సిఆర్ ఫైర్

By Pratap
|
Google Oneindia TeluguNews

C Ramachandraiah
హైదరాబాద్: తిరుమల-తిరుపతి దేవస్థానం (టిటిడి) ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (ఈవో) ఎల్వీ సుబ్రహ్మణ్యంపై రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి సి.రామచంద్రయ్య తీవ్రంగా మండిపడ్డారు. ఈవో అడ్డదిడ్డంగా వ్యవహరిస్తున్నారని, ఆయనకు తోచినట్టు చేస్తూ తనను, ప్రభుత్వాన్ని ఇబ్బందులకు గురిచేస్తున్నారని మంత్రి రామచంద్రయ్య ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మిన్నీ మాథ్యూకు ఘాటుగా లేఖ రాశారు. రామచంద్రయ్య లేఖతో అధికార యంత్రాంగంలో కలకలం రేగింది.

ఈ వివాదానికి సంబంధించిన పూర్వపరాలు ఈ విధంగా ఉన్నాయి - తిరుమల-తిరుపతి దేవస్థానంలో పలు అవకతవకలు జరుగుతున్నాయని శాసనసభ పిటిషన్స్ కమిటీకి ఓ ఫిర్యాదు అందింది. ఈ పిటిషన్‌ను పరిశీలించి ఏం చర్యలు తీసుకున్నారో తెలియజేయాలని పిటిషన్స్ కమిటీ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. నిబంధనల ప్రకారం శాసనసభ ఏదైనా సమాచారం కోరితే సంబంధిత మంత్రి కార్యదర్శి దానికి బాధ్యత తీసుకోవాలి.

పిటిషన్స్ కమిటీ రాసిన లేఖ కూడా మంత్రి రామచంద్రయ్యకు, అక్కడి నుంచి దేవాదాయశాఖ వ్యవహారాలు చూస్తున్న రెవెన్యూ ముఖ్య కార్యదర్శి ఎంజే గోపాల్‌కు వెళ్లింది. శాసనసభ కమిటీ నుంచి వచ్చిన ఈ పిటిషన్‌పై విచారణ జరిపి తనకు నివేదిక పంపాలని ఎంజే గోపాల్ టిటిడి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎల్వీ సుబ్రహ్మణ్యంను కోరారు.

ఈ పిటిషన్‌లో పేర్కొన్న అంశాలకు సమాధానాలు రాస్తున్నప్పుడు సుబ్రహ్మణ్యం మంత్రి రామచంద్రయ్య ప్రస్తావన కూడా తేవాల్సి వచ్చినట్లు తెలిసింది. ఈ సమాధానం మంత్రి కార్యదర్శి ద్వారా మళ్లీ పిటిషన్స్ కమిటీకి వెళ్లాలి. అలా వెళితే మంత్రి నుంచి తనకు సమస్యలు వస్తాయని భావించిన ఎల్వీ సుబ్రహ్మణ్యం నేరుగా పిటిషన్స్ కమిటీకి పంపేశారు. ఇది తెలుసుకున్న మంత్రి రామచంద్రయ్య అగ్గిమీద గుగ్గిలం అయ్యారు.

English summary
Expressing anguish at Tirumala Tirupathi Devasthanam (TTD) EO LV Subrahmaniam, the endowment minister Ramachandraiah has written a letter to chief Secretary Minni Mathews.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X