జగన్‌ను వేరే రాష్ట్ర జైలుకు తరలించాలి: విహెచ్ నిప్పుల

జైలులో పార్టీని నడుపుతున్న జగన్‌ను ఇతర రాష్ట్రాల జైలుకు తరలించాలని విహెచ్ డిమాండ్ చేశారు. చంచల్‌గూడ జైలు జగన్ పార్టీ కార్యాలయంగా మారిపోయిందని మండిపడ్డారు. జగన్ అక్రమాస్తులపై న్యాయపోరాటం చేసే వాళ్లకు తాను అభినందనలు తెలియజేస్తున్నానని చెప్పారు.
వేర్వేరు న్యాయమా?
అధికారులతో పాటు మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణకు ఓ న్యాయం ఇతర మంత్రులకు ఓ న్యాయమా అని విహెచ్ ప్రశ్నించారు. జగన్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రులు రాజీనామా చేస్తే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వాటిని ఆమోదించాలన్నారు. లేదంటే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయన్నారు. వేర్వేరు న్యాయం అనే అభిప్రాయం ప్రజల్లో కలిగించవద్దని సూచించారు.
మహారాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ చవాన్ పైన ఆరోపణలు వచ్చినప్పుడు తమ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆయనతో రాజీనామా చేయించిందన్నారు. ముఖ్యమంత్రి కూడా అదే రకంగా వ్యవహరించాలన్నారు. కొందరు నేతలు సిబిఐ కేసులు పెట్టడం వల్ల పాపులారిటీ వచ్చిందని అనడం విడ్డూరంగా ఉందన్నారు. మంత్రుల రాజీనామాలను ఆమోదించి ఎవరు తప్పు చేసినా క్షమించమని ప్రజలకు చెప్పాలన్నారు.












Click it and Unblock the Notifications