కెసిఆర్‌ని కలిసిన ముగ్గురు ఎంపీలు, ముహూర్తం

ఈ భేటీలో తెలంగాణ రాష్ట్ర సమితి ఎమ్మెల్యేలు హరీష్ రావు, కల్వకుంట్ల తారక రామారావులు పాలుపంచుకున్నారు. కెసిఆర్‌తో భేటీ అయిన ఎంపీలు రాజయ్య, వివేక్, మంద జగన్నాథం, కెకెలు జూన్ 3వ తేదిలోగా తెరాసలో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయంటున్నారు. కాంగ్రెసు పార్టీ అధిష్టానం ఇక తెలంగాణ ఇవ్వదనే అభిప్రాయానికి వారు వచ్చినందు వల్లే తెరాసలో చేరేందుకు ముహూర్తం కోసం కెసిఆర్‌తో భేటీ అయ్యారని అంటున్నారు.
ఇప్పటికే తెలంగాణ ఉద్యమం జోరుగా ఉండటంతో పాటు అధిష్టానం వైఖరి కూడా వారికి అసంతృప్తిని కలిగిస్తోంది. తెలంగాణపై ఢిల్లీ కాంగ్రెసు పెద్దలు రోజుకో మాట మాట్లాడుతున్నారు. తెలంగాణ అంశాన్ని తేల్చుతామని చెబుతున్నారే కానీ నిర్దిష్ట సమయంలోగా తేల్చుతామని చెప్పడం లేదు. మరోవైపు వాయలార్ రవి తెలంగాణను కాఫీ, టీలతో పోల్చడం, పిసి చాకో తెలంగాణ తమ అజెండాలో లేదని నాలిక్కర్చుకోవడం తెలంగాణ ప్రాంత కాంగ్రెసు నేతలు జీర్ణించుకోవడం లేదు.
కెకె, మంద జగన్నాథం, రాజయ్యలు ఆదివారం వివేక్ ఇంట్లో భేటీ అయిన విషయం తెలిసిందే. వారు అధిష్టానానికి అల్టిమేటం జారీ చేశారు. ఈ నెలాఖరులోగా తెలంగాణపై అధిష్టానం తేల్చాలని లేదంటే తాము ఇతర పార్టీలలో చేరక తప్పదని హెచ్చరించారు కూడా.
-
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే -
AP Govt: ఏపీలో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ఇక సులువు-తాజా రూల్స్..! -
చిన్నమ్మ పార్టీ, పేరు, జెండా, అజెండా వెల్లడి












Click it and Unblock the Notifications