చెన్నై ఓనర్ అల్లుడితో టచ్‌లో విందూ?: ధోనీ భార్యతో...
ముంబై: ప్రముఖ బాలీవుడ్ నటుడు విందూ దారా సింగ్‌ను మంగళవారం ముంబై పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. విందూకు బుకీలతో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలతో అతనిని అరెస్టు చేసి కోర్టు అనుమతితో కస్టడీకి తీసుకున్నారు. అయితే విందూ చెన్నై సూపర్ కింగ్స్ యజమాని అల్లుడితో నిత్యం టచ్‌లో ఉండేవాడని పోలీసులు గుర్తించినట్లుగా వార్తలు వస్తున్నాయి.
సిఎన్ఎన్ ఐబిఎన్ ప్రకారం... విందూ చెన్నై సూపర్ కింగ్స్ యజమాని బంధువుతో టచ్‌లో ఉండేవాడని పోలీసులు గుర్తించారు. ఐబిఎన్7 ట్వీట్ ప్రకారం... విందూ చెన్నై యజమాని అల్లుడు గురునాథ్‌తో టచ్‌లో ఉండేవాడు.

విందూ ఫోన్ కాల్ రికార్డ్స్‌లో ఓ టీమ్ ఓనర్ బంధువు నంబరు ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారట. గత మూడు రోజుల విందూ ఫోన్ రికార్డ్స్‌ను పోలీసులు విచారిస్తే అందులో అతని నెంబర్ ఉందని టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చింది. విందూ విషయమై పోలీసులు ఆరా తీస్తున్నారు.
విందూ అతనికి ఫోన్ చేసిన తర్వాత ఓ బుకీతో మాట్లాడారని పోలీసులు చెప్పినట్లుగా వార్తలు వస్తున్నాయి. అంతేకాకుండా విందూ చెన్నై టీం విఐపి బాక్సులో కూర్చుని మ్యాచ్ చూసిన సందర్భాలు ఉన్నాయని, అవి అనుమానాలను రేకెత్తిస్తున్నాయంటున్నారు. విందూ స్పాట్ ఫిక్సింగ్‌లో పాల్గొన్నాడా? బుకీలతో సంబంధాలు ఉన్నాయా అనే కోణంలో దర్యాఫ్తు చేస్తున్నారు.
మరోవైపు బుకీలు, రాజస్థాన్ రాయల్స్‌కు చెందిన ముగ్గురు ప్లేయర్ల అరెస్టుకు విందూ అరెస్టుకు సంబంధాలు లేవనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. విందూపై చీటింగ్, ఫోర్జరీ తదితర సెక్షన్ల కింద కేసులు బుక్ అయ్యారని అంటున్నారు. ధోనీ భార్య సాక్షితో విందూ మ్యాచ్ సమయంలో కనిపించారు.












Click it and Unblock the Notifications