సిడబ్లుసి మాజీగా చెబుతున్న కాంగ్రెస్‌ని నమ్మొద్దు: కెకె

"మనసులో తెలంగాణవాదం పెట్టుకొని.. మీదికి ఏదో చెప్పటం సరికాదు. మాటలు మానండి. ఇంకా వేచిచూసే సమయం లేదు. కాంగ్రెస్ నిర్ణయం తీసుకోదు. ఆ పార్టీలో అత్యున్నతమైన సిడబ్ల్యూసిలో సభ్యుడిగా పనిచేసిన వ్యక్తిగా చెబుతున్నా. కాంగ్రెస్‌ను ఇక నమ్మకండి'' అని చెప్పారు.
"ఇది ప్రజా ఉద్యమం. ప్రజా యుద్ధంగా మారింది. దీనికి కథా నాయకులు ఎవరైనా.. రథసారథులు లేనిదే ముందుకు సాగదు. ఇది ధర్మ యుద్ధం'' అన్నారు. తెలంగాణ కోసం ఆత్మబలిదానం చేసుకున్న వెయ్యి మంది అమరుల ఆశయాల పూర్తికి కంకణం కట్టుకొని యుద్ధం చేస్తామని చెప్పారు.
తెలంగాణ కోసం జెఏసి, ప్రజలు, విద్యార్థులు అంతా ఉద్యమం చేస్తున్నారని, పార్లమెంటులోనూ కేంద్రాన్ని ఎంపీలు నిలదీశారని, ఇంకా ఏం చేయాలని కెకె ప్రశ్నించారు. ఈ విషయంలో తాను ఓడిపోయానని, ఇప్పుడు అంతా ప్రజల చేతుల్లో ఉందన్నారు. ప్రజలకే ఎక్కువ అధికారం ఉందని, ప్రజల ఓటుతో తెలంగాణ సాధించుకుంటామన్నారు. ప్రజల వద్దకు వెళ్లి పోరాట పటిమ పెంచుతామని, తెలంగాణ సాధిస్తామన్నారు. అన్నింటికీ తాను జవాబు చెబుతానని, తెలంగాణ వాదం తన ప్రాణమని, దేనికైనా సిద్ధమని స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications