పార్టీ అధ్యక్షులుగా జగన్, చంద్రబాబు: కెసిఆర్‌కు కౌంటర్

K Chandrasekhar Rao
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు పైన తెలుగుదేశం, కాంగ్రెసు పార్టీలు కొత్త ఎత్తుగడ వేస్తున్నాయి. టిడిపి, వైయస్సార్ కాంగ్రెసులు ఆంధ్రా పార్టీలు అని, ఆ పార్టీలలో తెలంగాణ వారు అధ్యక్షులు కాగలరా అని తెరాస నేతలు పలుమార్లు ప్రశ్నించారు. అందుకు ధీటుగా కొత్త వాదన తెర పైకి తీసుకు వస్తున్నాయి. టిడిపి నేత మోత్కుపల్లి నర్సింహులు, కాంగ్రెసు పార్టీ ఎమ్మెల్సీలు ప్రభాకర్, రాజేశ్వర్ తదితరులు దళిత అధ్యక్ష వాదనను తెరపైకి తీసుకు వచ్చారు.

తెలంగాణ వస్తే దళిత నేతను ముఖ్యమంత్రిని చేస్తామని చెబుతున్న కెసిఆర్.. అంతకుముందు దళిత నేతను తెరాస అధ్యక్షుడుగా చేయగలరా అని సవాల్ చేస్తున్నారు. దళితులపై మమకారం ఉంటే దళిత నేతను అధ్యక్షుడిని చేయాలన్నారు. కాంగ్రెసు ఎమ్మెల్సీలు మాట్లాడుతూ... చనిపోయిన వారి పేరు చెప్పుకొని కెసిఆర్ బతుకుతున్నారని నిప్పులు చెరిగారు.

ఉద్యమం పేరుతో చందాలు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. కొడుకు, కూతురు, అల్లుడు ఇదే తెరాస అంటే అన్నారు. ఆదివారం నాటి బహిరంగ సభలో ఎంపీలు వివేక్, మందా జగన్నాథంను మాట్లాడించక పోవడం దళితులను అవమానించడమే అన్నారు. బ్లాక్ మెయిల్ చేస్తున్న కెసిఆర్ జైలుకు వెళ్లక తప్పదని వారు మండిపడ్డార.

కాగా కొంతకాలంగా టిడిపి, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలు అధ్యక్షులుగా తెలంగాణ నేతలను చేస్తాయా అని తెరాస నేతల సవాల్‌కు.... ఇప్పుడు దళితులను పార్టీ అధ్యక్షుడు చేయగలరా అంటూ కౌంటర్ విసరడం గమనార్హం.

రాజ్‌నాథ్‌తో జెఏసి భేటీ

బిజెపి జాతీయాధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్‌ను జెఏసి నేతలు కలిశారు. ఈ సందర్బంగా సింగ్ మాట్లాడుతూ.. కాంగ్రెసు తెలంగాణను నాన్చుతూనే ఉంటుందని, కాంగ్రెసుకు తెలంగాణపై కమిట్మెంట్ లేదని, విద్యార్థుల త్యాగాలు వృధా కానివ్వమని, బిజెపి అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లో తెలంగాణపై ప్రకటన చేస్తామన్నారు.

చెవిలో పువ్వులు: కోదండరామ్

కేంద్రమంత్రి, రాష్ట్ర కాంగ్రెసు పార్టీ వ్యవహారాల ఇంఛార్జ్ గులాం నబీ ఆజాద్ డెడ్ లైన్ పేరుతో తెలంగాణ ప్రజల చెవుల్లో పువ్వులు పెడుతున్నారని జెఏసి చైర్మన్ కోదండరామ్ అన్నారు. ఎంపీలు పార్టీని వీడకుండా అలాంటి ప్రకటన చేశారన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+