ఛేజింగ్ చేసి మావోల్ని అరెస్ట్ చేశారు: వారిలో మాధురి?

 Three maoists arrested
ఖమ్మం/నిజామాబాద్: మావోయిస్టులు ఓ వాహనంలో వెళ్తున్నారని తెలిసిన ఖమ్మం జిల్లా పోలీసులు సోమవారం వారిని ఛేజ్ చేసి పట్టుకున్నారు. ఈ సందర్భంగా మావోల వాహనం బోల్తా పడింది. దీంతో వారు పట్టుబడ్డారు. భద్రాచలం నుండి కొత్తగూడెం వెళ్తున్న మావోయిస్టులను ముందస్తు సమాచారంతో పోలీసులు వెంబడించారు.

ఈ క్రమంలో కొత్తగూడెం, పాల్వంచలోని సాయినగర్ వద్ద మావోయిస్టులు ప్రయాణిస్తున్న జీపు బొల్తా పడింది. ఘటనలో జీపులో ప్రయాణిస్తున్న ముగ్గురు నక్సలైట్లకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదాన్ని గమనించిన పోలీసులు సంఘటనా ప్రదేశానికి చేరుకోగానే మావోయిస్టులు థర్మారాజు, పృధ్వీలతోపాటు మరో మహిళా మావోయిస్టు తప్పించుకునే ప్రయత్నం చేశారు.

ఆ మహిళను ఉత్తర తెలంగాణ కార్యదర్శి చంద్రన్న భార్య సక్కుబాయి, అలియాస్ రాధ అలియాస్ మాధురిగా అనుమానిస్తున్నారు. ఆమెకు ఛత్తీస్‌గఢ్ దాడి ఘటనతో సంబంధం ఉన్నట్లుగా తెలుస్తోంది. వారిని పోలీసులు అదుపులోకి తీసుకుని, చికిత్స నిమిత్తం కొత్తగూడెం ఆస్పత్రికి తరలించారు. వారు చికిత్స కోసం విజయవాడ వెళ్తున్నట్లుగా తెలుస్తోంది.

కామారెడ్డి సిఐని అరెస్టు చేయాలని ఆదేశం

కామారెడ్డి సిఐ కృష్ణను అరెస్టు చేయాలని నిజామాబాద్ జిల్లా కోర్టు సోమవారం పోలీసులను ఆదేశించింది. న్యాయవాది గోపిపై దాడి చేసిన కేసులో సిఐని అరెస్టు చేయాలని కోర్టు స్థానిక పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. గతంలో కృష్ణకు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయింది. ఆ కేసు విచారణకు సిఐ హాజరు కాలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+