భర్తను చంపిన భార్య, భార్యాకూతుళ్లను చంపిన వ్యక్తి

ఇదిలావుంటే, ఓ వ్యక్తి నాలుగేళ్ల కూతురిని, భార్యను హత్య చేశాడు. మహబూబ్‌నగర్ జిల్లాలోని మిడ్జిల్ పోలీసు స్టేషన్ పరిధిలో గల ముసిగొండ్లపల్లి గ్రామంలో జరిగిన ఈ సంఘటన ఆదివారంలో వెలుగులోకి వచ్చింది. కూతురికి, భార్యకు నిప్పంటించి వారిని చంపాడు. మృతుల కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సంఘటన బయటపడింది.
కూతురికి, భార్యకు ఏప్రిల్ 26వ తేదీన నిప్పంటించి చంపినట్లు బందూలాల్ పోలీసు విచారణలో అంగీకరించాడు. మృతులను 30 ఏళ్ల రుక్మిణి బాయి, నాలుగేళ్ల పల్లవిగా గుర్తించారు. తన భార్య, కూతురు కనిపించకుండా పోయారని బందూలాల్ అంతకు ముందు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
భార్యాకూతురు తప్పిపోయారని ఫిర్యాదు చేసి, తప్పించుకోవడానికి బందూలాల్ ప్రయత్నించాడని పోలీసులు అంటున్నారు. హత్య నేరం కింద పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications