అమెరికా యాత్రికురాలిపై అత్యాచారం: ముగ్గురి అరెస్టు

ముప్పయి ఏళ్ల అమెరికా మహిళపై సోమవారం రాత్రి ట్రక్కులో వారు ఆ అఘాయిత్యానికి ఒడిగట్టారు. తాము లిఫ్ట్ ఇస్తామని చెప్పి ట్రక్కులో ఎక్కించుకుని వారు ఆ దారణానికి దిగినట్లు పోలీసులు తెలిపారు. న్యూఢిల్లీకి 500 కిలోమీటర్ల దూరంలో గల మనాలీలో ఆ సంఘటన చోటు చేసుకుంది. యాత్రికురాలు అత్యాచారానికి గురైనట్లు వైద్య పరీక్షల్లో తేలిందని పోలీసులు చెప్పారు. నిందితుల కోసం పోలీసులు గాలించారు.
ట్రక్కు నెంబర్ ప్లేటు తనకు గుర్తు లేదని, వారు ఏం మాట్లాడుతున్నారో కూడా తనకు అర్థం కాలేదని, నిర్మానుష్య ప్రదేశానికి ట్రక్కును తీసుకుని వెళ్లి తనపై గంటపాటు అత్యాచారం జరిపారని మహిళ పోలీసులకు చెప్పింది. దర్యాప్తులో భాగంగా ప్రతి ట్రక్కు డ్రైవర్ మనాలి పోలీసు స్టేషన్‌లో హాజరున కావాలని ఆదేశాలు జారీ చేసినట్లు పోలీసు అధికారులు చెప్పారు.
విదేశీ మహిళలపై ఇటీవలి కాలంలో భారతదేశంలో అత్యాచారాలు పెరిగినట్లు భావిస్తున్నారు. ఢిల్లీలో 23 ఏళ్ల వైద్య విద్యార్థినిపై సామూహిక అత్యాచారం జరిగిన తర్వాత భారతదేశానికి విదేశీ మహిళా యాత్రికుల సంఖ్య గణనీయంగా తగ్గింది. భారతదేశంలో విదేశీ మహిళలపై జరిగిన అత్యాచారాల ఘటటలు విదేశీ పత్రికల్లో పతాక శీర్షికలను ఆక్రమిస్తున్నాయి. మధ్యప్రదేశ్‌లో మార్చిలో స్విస్ సైక్లిస్టుపై సామూహిక అత్యాచారం జరిగింది.












Click it and Unblock the Notifications