కెసిఆర్‌పై ఎర్రబెల్లి ఫైర్: జైళ్లలో ఫోన్స్ అంటూ యనమల

ఇటీవల మృతి చెందిన తెరాస నేత నాగరాజుకు సంతాపం కూడా ప్రకటించలేదన్నారు. అమరవీరుల కుటుంబాన్ని కెసిఆర్ మోసగిస్తున్నారని, ఈ విషయాన్ని తెలంగాణ ప్రజలు తెలుసుకోవాలని కోరారు. తెలంగాణ రాజకీయ ఐక్యకార్యాచరణ సమితి చైర్మన్ ఆచార్య కోదండరామ్ జెఏసి చైర్మన్‌గా కాకుండా తెరాస చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారని, ఆయన కెసిఆర్ తొత్తుగా మారారన్నారు.
కోదండరామ్ వైఖరి వల్ల జెఏసి నుండి మేధావులు, కవులు వెళ్లిపోతున్నారన్నారు. సకల జనుల సమ్మెను కెసిఆర్ నీరుగారిస్తే, కోదండరామ్ ఆయనకు సహకరించారన్నారు. తెలంగాణ కోసం ఆత్మహత్య చేసుకున్న వారిపై కెసిఆర్‌కు ఏమాత్రం దిగులు లేదని నిప్పులు చెరిగారు.
జగన్‌పై యనమల
టిడిపి శాసన మండలి సభ్యుడు యనమల రామకృష్ణుడు జైళ్ల శాఖ డిజి కృష్ణ రాజుకు ఓ లేఖ రాశారు. చంచల్‌గూడ జైలులో ఖైదీలు అత్యాధునిక సాంకేతిక సహకారంతో స్మార్ట్ ఫోన్లను వినియోగిస్తున్నారని యనమల లేఖలో పేర్కొన్నారు. జైలు దగ్గర వాహంలో రహస్యంగా వైఫై కనెక్షన్ ఏర్పాటు చేసుకున్నారని, దీని ద్వారా ఖైదీలు తమ కార్యకలాపాలు కొనసాగిస్తున్నారని, అక్కడ జామర్లను ఏర్పాటు చేయాలన్నారు.












Click it and Unblock the Notifications