దొంగ ఏడుపుతో గేమ్, జైలు వద్దే..: విజయమ్మపై ఆనం

కొడుకు చేసిన లక్ష కోట్ల అవినీతిని కప్పిపుచ్చుకునేందుకు ఆ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మ మైండ్ గేమ్ ఆడుతున్నారన్నారు. కోర్టు వద్ద దొంగ ఏడుపులు ఏడుస్తున్నారని మండిపడ్డారు. కొడుకు కోసం రోజూ జైలుకెళ్లి వస్తున్న ఆమె అక్కడే ఏడ్వొచ్చు కదా అని ప్రశ్నించారు.
గతంలో గ్రామాల్లో మూగజీవాలను పోతురాజులు బలి తీసుకునేవారని, ఆ సంప్రదాయాన్ని ఇపుడు జగన్ పాటిస్తున్నారని విమర్శించారు. తన ధన, అధికార దాహంతో అమాయకులను బలి తీసుకుంటున్నారని మండిపడ్డారు. మాజీ మంత్రులు మోపిదేవి వెంకటరమణ, ధర్మాన ప్రసాద రావు, సబితా ఇంద్రా రెడ్డిలతో పాటు పలువురు ఐఏఎస్ అధికారులు జగన్ అవినీతికి బలిపశువులయ్యారని ధ్వజమెత్తారు.
కొడుకు కోసం ఏడుస్తున్న విజయమ్మ.. బలైన మంత్రులు, అధికారుల కోసం ఎందుకు ఏడ్వడం లేదని ప్రశ్నించారు. వైయస్ వల్ల తాము ఏనాడూ లబ్ధి పొందలేదని, తమ వల్లే ఆయనకు రాజకీయ జీవితం ఏర్పడిందని స్పష్టం చెప్పారు. సిబిఐ జెడి లక్ష్మినారాయణ బదిలీ అయితే ఆయన స్థానంలో మరింత సమర్థుడైన అధికారి అరుణాచలం వస్తున్నారని, ఆయన ఒక్కసారి చెబితే వంద సార్లు చెప్పినట్లేనని అన్నారు.












Click it and Unblock the Notifications