ఆలస్యమొద్దు: మోడీ కోసం పట్టు, అద్వానీకి బుజ్జగింపు

పనాజీ: దేశ ప్రజల నమ్మకాన్ని కాంగ్రెసు పార్టీ, యూపిఏ ప్రభుత్వం కోల్పోయిందని గుజరాత్ ముఖ్యమంత్రి, భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత నరేంద్ర మోడీ ఆదివారం అన్నారు. ప్రస్తుత పాలనపై ప్రజల్లో ఆగ్రహం పెల్లుబుకుతోందన్నారు. ఈ పాలన నుండి దేశానికి స్వేచ్ఛ కలగలాని ఆయన అన్నారు. గోవాలోని పనాజీలో బిజెపి పదాదికారుల సమావేశం రెండో రోజు కొనసాగుతోంది.

యుపిఏ వివక్ష: షాన్‌వాజ్

యుపియేతర రాష్ట్ర ప్రభుత్వాలపై కేంద్రం వివక్ష చూపిస్తోందని షాన్‌వాజ్ హుస్సేన్ ఆరోపించారు. యూపిఏకు ఉత్సవాలు చేసుకునేందుకు కారణాలే లేవన్నారు. బిజెపికి అగ్రనేత అద్వానీ ఆశీస్సులు ఎప్పుడు ఉంటాయన్నారు. ఈ నెల 17న దేశవ్యాప్తంగా జైల్ భరో కార్యక్రమం చేపడుతున్నట్లు చెప్పారు.

Narendra Modi - LK Advani

కాంగ్రెసులో రెండు పవర్ సెంటర్లు ఉండటం వల్ల అది దేశ అభివృద్ధిపై ప్రభావం పడుతోందన్నారు. యూపిఏ పాలనలో నాలుగేళ్లుగా ఆర్థికవ్యవస్థ తిరోగమనంలో ఉందన్నారు. కాగా మోడీ విషయంలో దేశ ప్రజల ఆకాంక్ష నెరవేరబోతుందన్నారు. తద్వారా ఎన్డీయే ప్రధాని అభ్యర్థిగా ఆయనే ప్రకటించనున్నారని అర్థమవుతోంది.

మోడీ పేరును త్వరగా ప్రకటించండి: గోవా సిఎం

నరేంద్ర మోడీకి పార్టీ ఎన్నికల కమిటీ సారథ్య బాధ్యతలను అప్పగించాలని అధిష్టానంపై ఒత్తిడి పెరుగుతోంది. ప్రచార కమిటీ సారథిగా మోడీ పేరును త్వరగా ప్రకటించాలని గోవా సిఎం పారికర్ డిమాండ్ చేశారు. మోడీకి బిజెపి పాలిత మూడు రాష్ట్రాల సిఎంలు(శివరాజ్ సింగ్ చౌహాన్, మధ్యప్రదేశ్, రమణ్ సింగ్, ఛత్తీస్‌గఢ్, పారికర్, గోవా)లు అనుకూలంగా ఉన్నారు. మరోవైపు ఆర్ఎస్ఎస్ కూడా మోడీ పేరు ప్రకటనపై ఆలస్యం వద్దని సూచించింది.

భయ్యాజీ జోషీ మధ్యవర్తిత్వం!

మోడీ కోసం ఓ వర్గం పట్టుబడుతుండగా.. అద్వానీ వర్గం వ్యతిరేకిస్తోంది. మోడీపై వ్యతిరేకత కారణంగానే అద్వానీ శనివారం భేటీకి రాలేదని, సుష్మా స్వరాజ్ ఆలస్యంగా వచ్చారని చెబుతున్న నేపథ్యంలో ఈ రోజు ఆరఎస్ఎస్‌కు చెందిన భయ్యాజీ జోషీ ఆదివారం అద్వానీతో భేటీ అయ్యారు. ఆయన నచ్చజెప్పే ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. మరోవైపు పదకొండు మందితో కూడిన ప్రచార కమిటీని ఈ రోజు ప్రకటించే అవకాశాలు ఉన్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+