ప్రచార సారథి మోడీ, తొలిసారి బిసి: అద్వానీ శకం క్లోజ్!
పనాజీ: 2014 భారతీయ జనతా పార్టీ ఎన్నికల ప్రచార కమిటీ చైర్మన్‌గా గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీని నియమించారు. మోడీనే నియమిస్తారనే ప్రచారం తొలి నుండి సాగినా అగ్రనేత లాల్ కృష్ణ అద్వానీ అనుకూలంగా లేకపోవడంతో కొంత సస్పెన్స్ కొనసాగింది. శనివారం రోజు మోడీ పదాధికారుల సమావేశంలో మాట్లాడాల్సి ఉండగా, అద్వానీ రాకపోవడంతో ఆయన ఆదివారానికి వాయిదా వేసుకున్నారు.
ఈ రోజు కూడా అద్వానీ రాకపోవడంతో తీవ్ర తర్జన భర్జన అనంతరం మోడని ప్రచార కమిటీ చైర్మన్‌గా పార్టీ అధ్యక్షుడు రాజ్ నాథ్ సింగ్ ప్రకటించారు. ఆయన ప్రకటన చేసినప్పుడు పక్కన లోకసభ ప్రతిపక్ష నాయకురాలు సుష్మా స్వరాజ్ ఉన్నారు. ఆమె అద్వానీ వర్గంగా ముద్రపడ్డారు. ఈ ప్రచార కమిటీలో పదకొండు మంది సభ్యులు ఉంటారు.

మోడీని చూసి కాంగ్రెసు భయపడుతోంది: రాజ్ నాథ్
మోడీని చూసి కాంగ్రెసు పార్టీ భయపడుతోందని రాజ్ నాథ్ సింగ్ అన్నారు. దేశ ప్రజల నమ్మకాన్ని కాంగ్రెసు పార్టీ, యూపిఏ ప్రభుత్వం కోల్పోయిందని గుజరాత్ ముఖ్యమంత్రి, భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత నరేంద్ర మోడీ అన్నారు. ప్రస్తుత పాలనపై ప్రజల్లో ఆగ్రహం పెల్లుబుకుతోందన్నారు. ఈ పాలన నుండి దేశానికి స్వేచ్ఛ కలగలాని ఆయన అన్నారు. దేశానికి కాంగ్రెసేతర ప్రభుత్వం కావాలన్నారు.
అద్వాని శకం ముగిసి మోడీ శకం
మోడీకి బాధ్యతలు అప్పగించడంతో ఇక బిజెపిలో అద్వానీ శకం ముగిసి మోడీ శకం ప్రారంభమైనట్లుగానే భావించవచ్చు. బిజెపి మొదటిసారి ఓ బిసి నేతను అందలం ఎక్కించింది. అద్వానీ బిజెపిని రెండు సీట్ల స్థాయి నుండి అధికారం వరకు తీసుకు వచ్చారు. ఇప్పుడు ఆయన నిర్ణయాలకు పార్టీలో ప్రాధాన్యత లేకుండా పోయినట్లుగా కనిపిస్తోంది. మోడీకి ఆర్ఎస్ఎస్ గట్టిగా మద్దతు పలుకుతోంది. అద్వానీ లేకపోయినప్పటికీ ఆర్ఎస్ఎస్ డిమాండ్ వల్లనే మోడిని ప్రకటించినట్లుగా చెబుతున్నారు. మోడీకి బాధ్యతలు అప్పగించడం పట్ల అద్వానీతో పాటు ఆయన వర్గం కినుక వహించింది. మరోవైపు మోడీకి పలువురు అభినందనలు తెలియజేశారు.












Click it and Unblock the Notifications