సిబిఐ ఎఫ్ఐఆర్‌లో నిందితుడిగా దాసరి: అరెస్ట్ అవకాశం

Dasari Narayana Rao
న్యూఢిల్లీ: బొగ్గు కుంభకోణం కేసులో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సిబిఐ) ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఇందులో మాజీ కేంద్రమంత్రి, దర్శకరత్న దాసరి నారాయణ రావు పేరును నిందితుడిగా చేర్చింది. దాసరితో పాటు కాంగ్రెసు పార్టీ పార్లమెంటు సభ్యుడు నవీన్ జిందాల్‌ను ఇందులో నిందితుడిగా పేర్కొంది. దాసరిని ఎఫ్ఐఆర్‌లో నిందితుడిగా చేర్చడంతో ఆయన అరెస్టుకు అవకాశాలున్నాయని అంటున్నారు.

హైదరాబాదు, న్యూఢిల్లీ, కోల్‌కతా తదితర నగరాల్లోని 19 ప్రాంతాల్లో సిబిఐ మంగళవారం సోదాలు నిర్వహిస్తోంది. హైదరాబాదులోని దాసరి ఇంట్లో సిబిఐ సోదాలు చేస్తోంది. బొగ్గు కుంభకోణం కేసులో సిబిఐ ఇప్పటికే దాసరి నారాయణ రావును ప్రశ్నించిన విషయం తెలిసిందే. ఈ రోజు సిబిఐ తన ఎఫ్ఆర్‌లో ఆయన పేరును కూడా దాఖలు చేయడం గమనార్హం.

కాగా, కేంద్రంలో ప్రకంపనలు సృష్టించిన బొగ్గు కుంభకోణం కేసులో దాసరి నారాయణ రావును ఇటీవల సిబిఐ ప్రశ్నించింది. ఈ కుంభకోణానికి సంబంధించి మాజీ మంత్రులను ప్రశ్నించింది. 2006-2009 మధ్యకాలంలో బొగ్గు శాఖలో భారీ కుంభకోణం జరిగిందని కాగ్ నివేదిక ద్వారా వెలుగు చూసిన విషయం తెలిసిందే.

అప్పుడు దాసరి బొగ్గు శాఖ సహాయమంత్రిగా ఉన్నారు. ఈ నేపథ్యంలో కేసుకు సంబంధించి మాజీ మంత్రులను ప్రశ్నించింది. దాసరిని హైదరాబాదులోనే సిబిఐ ఆయనను విచారించింది. దాసరితో పాటు మరో మాజీ మంత్రి సంతోష్ బగ్రోడియాను కూడా అప్పుడు ప్రశ్నించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+