ఎన్టీఆర్ విగ్రహ ధ్వంసం: అంబేడ్కర్ విగ్రహధ్వంసం, బంద్

ఇంకా దీనిని ప్రారంభించలేదు. సమీపంలో మద్యం బెల్టు దుకాణం కూడా ఉంది. దీంతో ఉద్దేశ్యపూర్వకంగా కాకుండా.. ఎవరైనా మద్యం మత్తులో విగ్రహాన్ని ధ్వంసం చేసి ఉంటారని స్థానికులు భావిస్తున్నారు. దీంతో బెల్టు దుకాణాన్ని వెంటనే ఎత్తి వేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
అంబేడ్కర్ విగ్రహం ధ్వంసం నేపథ్యంలో బంద్
తూర్పు గోదావరి జిల్లా ఏలూరులో అంబేడ్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసినందుకు గాను ప్రజలు ఈ రోజు బందుకు పిలుపునిచ్చారు. అంబేడ్కర్ విగ్రహం ధ్వంసం విషయంలో పోలీసులు నిర్లక్ష్యం వహిస్తున్నారని, నిందితులను పట్టుకోలేదని ఆరోపిస్తున్నారు. బందుకు పిలుపునివ్వడంతో ఏలూరు డిపోలో బస్సులు నిలిచిపోయాయి.
విద్యార్థుల ఆందోళన
కర్నూలు పట్టణంలో ఓ ప్రయివేటు కళాశాలపై అఖిల భారత విద్యార్థి పరిషత్(ఎబివిపి) కార్యకర్తలు దాడి చేసి ఫర్నీచర్ ధ్వంసం చేశారు. విద్యార్థినిపై చేయి చేసుకున్నారని ఆరోపిస్తూ విద్యార్థులు, కార్యకర్తలు ఆందోళకు దిగారు.
తమిళనాడులో 8 మంది విద్యార్థుల మృతి
తమిళనాడులో బుధవారం ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఎనిమిది మంది విద్యార్థులు మృతి చెందారు. పుదుకొట్టయ్ వద్ద ఓ ప్రయివేటు బస్సు, టాటా ఏస్ వాహనం ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఎనిమిది మంది స్కూల్ విద్యార్థులతో పాటు ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు. గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించారు.












Click it and Unblock the Notifications