దేవుడి దయవల్లే బయటపడ్డారు: హర్భజన్ సింగ్

ఐటీబీపీ క్యాంప్‌లో ఉండడం తన అదృష్టమని, ఈ జవాన్లు చాలా మందిని కాపాడుతున్నారని ఆయన చెప్పాడు. ఐటీబీపీ చాలా గొప్ప పని చే స్తోందని భజ్జీ తెలిపాడు. తాను హేమ్‌కుంత్ షాహిబ్ మందిరం దర్శనానికి వచ్చానన్నాడు. అయితే మళ్లీ తప్పకుండా ఇక్కడి వస్తానని చెప్పాడు.
యాత్రికులు తాము ఇక్కడ చిక్కుకు పోయామని భావిస్తున్నారని, అయితే వారు దేవుడి దయవల్లే ప్రాణాలతో ఉన్నారని అన్నాడు. ఉత్తర భారతాన్ని వరదలు ముంచెత్తుతున్న విషయం తెలిసిందే. ఇప్పటిక వరకు 131 మంది మరమించారు. 73 వేల మందికిపైగా యాత్రికులు వేర్వేరు చోట్ల చిక్కుకుపోయారు.
కేదార్‌నాథ్, బద్రీనాథ్, గంగోత్రి, యుమునోత్రిలను సందర్శించడానికి యాత్రికులు వచ్చారు. వారంతా ఉత్తరాఖండ్‌లో చిక్కుకున్నారు. ఉత్తరాఖండ్‌లో వర్షాల వల్ల 102 మంది మరణించారు.












Click it and Unblock the Notifications