సమన్వయలోపం: ఉత్తరాఖండ్ సహాయచర్యలపై షిండే

Sushil Kumar Shinde
డెహ్రడూన్: ఉత్తరాఖండ్ వరద బీభత్సం సహాయక చర్యల్లో రాష్ట్ర ప్రభుత్వ సంస్థల మధ్య సమన్వయ లోపం కనిపిస్తోందని కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే వ్యాఖ్యానించారు. సహాయక చర్యలను సమీక్షించడానికి ఆయన శనివారం ఇక్కడికి వచ్చారు. బాధితులను తరలించే కార్యక్రమం యుద్ధప్రాతిపదికన జరుగుతోందని, ఇంకా 40 వేల మంది యాత్రికులు వరద తాకిడి ప్రాంతాల్లో చిక్కుకుపోయి ఉన్నారని ఆయన అన్నారు.

యాత్రికులను తరలించడానికి మూడు రోజుల గడువు పెట్టినట్లు ఆయన తెలిపారు. వాతావరణం సరిగా లేకపోవడం వల్ల సహాయక చర్యలకు విఘాతం కలుగుతోందని, అయినాసరే మూడు రోజుల్లో యాత్రికులను తరలించాలని అనుకుంటున్నామని ఆయన చెప్పారు.

చిక్కుకుపోయిన యాత్రికులను తరలించడానికి కేదార్‌నాథ్, గౌరికుండ్ మధ్య, పండుకేశ్వర్, బంద్రీనాథ్ మధ్య ఫుట్ భ్రిడ్జిలు నిర్మించనున్నట్లు ఆయన తెలిపారు. ముఖ్యమంత్రి, ఉన్నతాధికారులతో సమీక్ష జరిపిన తర్వాత షిండే మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. జంగిల్‌చట్టిలో చిక్కుకుపోయినవారికి సహాయం చేయడానికి ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిపారు.

సమన్వయం సాధించడానికి డిజాస్టర్ మేనేజ్‌మెంట్ నిపుణుడు వికె దుగ్గల్ ఇక్కడే ఉంటారని ఆయన చెప్పారు. సహాయక చర్యలపై కేంద్రం దృష్టి పెడుతుందని ఆయన చెప్పారు. ఇది ప్రకృతి వైవరీత్యమే తప్ప మానవతప్పిదం కాదని ఆయన అన్నారు. కొన్ని శవాలు గుర్తు పట్టలేనంతగా పాడయ్యాయని, డిఎన్ఎ పరీక్షల కోసం ఆ శవాలను నిలువ చేస్తున్నామని షిండే చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+